కరోనా వైరస్ సోకడంతో సామాన్యులే కాదు ప్రజా ప్రతినిధులు సైతం భయాందోళనతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా కడప జిల్లాలో ఇలాంటి విషాదం చోటుచేసుకుంది. ఇటీవల కరోనా బారిన పడిన కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా ఉపాధ్యక్షుడు శిరిగిరెడ్డి గంగిరెడ్డి(55) ఆత్మహత్య (Sirigireddy Gangireddy Commits Suicide) చేసుకున్నారు. ఇటీవల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న శిరిగిరెడ్డి గంగిరెడ్డికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన ఆదివారం ప్రొద్దుటూరులోని మదన్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. Breakfast మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా..!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోమవారం రోజు బయటకు వెళ్తుంగా సెక్యూరిటీ సిబ్బంది, ఎక్కడికని అడిగారు. కిందకి వెళ్లి వస్తానని చెప్పిన కాంగ్రెస్ నేత తిరిగిరాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శిరిగిరెడ్డి గంగిరెడ్డి (Sirigireddy Gangireddy) ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్లపల్లె రైల్వే ట్రాక్‌కు వెళ్లిచూడగా.. ఆయన విగతజీవిగా కనిపించారు. కరోనా సోకిందన్న భయంతోనే కాంగ్రెస్ నేత ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.  Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి 
 తల్లి పాలతో కరోనా సోకుతుందా? ఏ జాగ్రత్తలు పాటించాలి 
Sanitizer: పదే పదే శానిటైజర్‌ వాడొద్దు.. ఎందుకో తెలుసా?