AP Congress: ఆంధ్రప్రదేశ్‌ ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో హస్తం పార్టీ అడ్రస్‌ లేకుండా పోయింది. దాదాపు రాష్ట్ర విభజన ఓ దశాబ్ధం గడిచినా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ కోలుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్‌ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించింది పార్టీ హైకమాండ్‌.. షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఢిల్లీ పెద్దలు భావించారు. కానీ గ్రౌండ్‌లో మాత్రం పరిస్థితులు విరుద్దంగా ఉన్నాయని తెలుస్తోంది. పార్టీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్‌ షర్మిల సీనియర్లను కలుపుకు పోవడం లేదట. దాంతో హస్తం సీనియర్లు గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక రాష్ట్రం రెండుగా విడిపోయాక. మూడు సార్లు ఎన్నికలు జరిగితే.. రెండుసార్లు టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఓకసారి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈ రెండుసార్లు కాంగ్రెస్‌ పార్టీకి మాత్రం డిపాజిట్లు కూడా రాలేదు. దాంతో పార్టీని పరుగులు పెట్టించేందుకు షర్మిల చేతికి పగ్గాలు అప్పగించారు. అయితే షర్మిల వచ్చాక పార్టీ కాస్తా పుంజుకున్నట్టు కనిపించినప్పటికీ.. ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు రాలేదు. చివరకు కడప నుంచి పోటీకి దిగిన షర్మిల కూడా ఓటమి పాలయ్యారు. కానీ ఎన్నికల సమయంలో అన్న జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో షర్మిల ఓ రెంజ్‌లో రెచ్చిపోయారు. జగనే టార్గెట్‌గా ఘాటైన విమర్శలు చేశారు.. ఒకనొక దశలో షర్మిలకు ఆ స్థాయిలో కౌంటరిచ్చే నేతలు వైసీపీలో లేరా అన్న చర్చ సైతం జరిగింది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. అయినప్పటికీ.. షర్మిల మాత్రం జగన్‌ను వదిలిపెట్టలేదు.. అంతేస్థాయిలో జగన్‌పై విరుచుకుపడుతున్నారు.. ఇక్కడే ఏదో తేడా కొట్టిందనే చర్చ జరుగుతోంది.. ఎవరైనా అధికార పార్టీని టార్గెట్‌ చేయడం సహజం. కానీ షర్మిల మాత్రం అధికార పార్టీని వదిలేసి.. ఇంకా ప్రతిపక్షాన్నే టార్గెట్‌ చేయడం వెనుక ఏదైనా పర్సనల్‌ ఎజెండా ఉందా అనే వాదనలు వినిపిస్తున్నాయి..


ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో షర్మిల తీరుపై సొంత పార్టీ లీడర్లే గుస్స అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పాతాళంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి పైకి లేపాల్సిన సమయంలో ఒంటెద్దు పోకడలు మంచిది కాదని హెచ్చరిస్తున్నారట. పార్టీ బలోపేతం కావాలంటే అందరిని కలుపుకుపోవాలని చురకలంటిస్తున్నారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఏదైనా నిరసనకు పిలుపునిస్తే పట్టుమని పదిమంది నేతలు కూడా రావడం లేదని వాపోతున్నారట.. కనీసం పార్టీ నేతలకు సమాచారం ఇవ్వకుండా ఆందోళన ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఈ విషయంలో పార్టీ చీఫ్‌ పద్దతి మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారట. తాజాగా ఏపీ కాంగ్రెస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ కూడా షర్మిలను టార్గెట్‌  చేశారు. పార్టీలో అందరిని కలుపుకుపోకపోతే.. కాంగ్రెస్ పార్టీకి మరిన్ని కష్టాలు తప్పవని షర్మిలను హెచ్చరించారు..


మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌లో చాలా మంది లీడర్లు కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరిపోయారు.. ఉన్నది కొద్దిమంది లీడర్లు మాత్రమే.. కనీసం వారిని కూడా కలుపుకుపోకుండా పోవడం ఏంటని క్యాడర్‌ సైతం ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికైనా తీరు మార్చుకుని పార్టీలో అందరినీ కలుపుకుపోవాలని డిమాండ్‌ చేస్తున్నట్టు సమాచారం. రానున్న రోజుల్లో అయినా పార్టీలో సీనియర్లను షర్మిల కలుపుకుపోతారా.! లేదంటే రాజన్న బిడ్డను తగ్గేదేలే లేదని అనుకుంటారా..! ఈ విషయంలో ఓ క్లారిటీ రావాలంటే మాత్రం కొద్దిరోజులు ఆగాల్సిందే..!


Also Read: Tiger: మళ్లీ పెద్దపులి కలకలం.. వణికిపోతున్న గ్రామస్థులు..


Also Read: MLC FIGHT: తెలంగాణలో ఎమ్మెల్సీ ఫైట్‌.. పోటీకి కాంగ్రెస్‌ నై!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.