తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీ వేగంగా స్పందించింది. ఏఎన్ ఐ కథనం ప్రకారం లోక్ సభలో టీడీపీ ప్రవేశపెట్టబోయే అవిశ్వాసానికి కాంగ్రెస్ పార్టీ తన పూర్తి మద్దతు తెలిపిింది.ఏపీ పీసీసీ చీఫ్ రఘవీరారెడ్డి ఈ మేరకు ప్రకటించారు. టీడీపీకి బద్ధవిరోధి పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసానికి మద్దతు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. అవిశ్వాసంతో ఎన్డీయే సర్కార్ కు ఏం జరుగుతుందనే విషయం అటుంచితే.. కాంగ్రెస్ పార్టీ టీడీపీకి దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నారు. ఇదే జరిగితే రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనమే అవుతుంది. 


అవిశ్వాసంతో మోడీకి తలనొప్పే
వాస్తవానికి టీడీపీ అవిశ్వాసం పెట్టినా కేంద్రం ప్రభుత్వ మనుగుడకు ఎలాంటి ధోకా లేదు. ఎందుకుంటే మోడీ సర్కార్ లోక్ సభలో మోజార్టీ స్థానాలు కలిగి ఉంది. దీంతో ఈ అవిశ్వాసం వీగిపోయే అవకాశాలే ఎక్కువ. అయితే అవిశ్వాస తీర్మానంతో దేశ రాజకీయాలను ప్రభావితం చేయవచ్చు. బద్ధ శత్రువులుగా భావించే పార్టీలు ఏకమయ్యేందుకు అస్కారం ఉంది. టీడీపీ-కాంగ్రెస్ వ్యవహారమే ఇందుకు నిదర్శనం. ప్రతి పక్షపార్టీలన్నీ ఐక్యతకు దారితీస్తే పరిణామాలు ఎలా ఉంటాయనేది యూపీ,బీహార్ ఉప ఎన్నికల్లో బీజేపీ ప్రత్యక్షంగా చూసింది. దీంతో ఈ అవిశ్వాసం వ్యవహారం మోడీ సర్కార్ కు తలనొప్పిగా మారింది.