ఏపీలో కరోనా పంజా.. ఒకేరోజు 43 మంది మృతి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ (Andhra Pradesh CoronaVirus Cases) కల్లోలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా భారీగా కేసులు నమోదువుతున్న ఏపీలో తాజాగా 1,916 మందికి కోవిడ్19 పాజిటివ్, ఏకంగా 43 మంది కరోనా మహమ్మారి బారిన పడి మరణించడం ఆందోళన రేపుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కేసులు మాత్రం అదుపులోకి రావడం లేదు.
AP Corona Cases | ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,916 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఇందులో రాష్ట్రంలో ఉన్నవారికి 1908 మందికి కరోనా సోకగా, మిగతా 8 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే ఏపీలో కరోనా కేసులు (AP CoronaVirus Cases) 33,019కు చేరుకున్నాయి. AP నుంచి అక్కడికి ఆర్టీసీ బస్సులు బంద్..
రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులకు గాను 17,467 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 15,144 కరోనా యాక్టీవ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో ఏకంగా 43 కరోనా మరణాలు సంభవించాయి. ఏపీలో ఇప్పటివరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 408కి చేరింది. వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
తాజాగా అనంతపురంలో 10 మంది, ప.గోదావరిలో 9 మంది, చిత్తూరులో ఐదుగురు, తూర్పు గోదావరిలో ఐదుగురు, కడపలో ఐదుగురు, కర్నూలు జిల్లాలో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరంలో ఒక్కరు చొప్పున ప్రాణాంతక కరోనాతో పోరాడుతూ మరణించారు. ఏపీలో గడిచిన 24 గంటల్లో 22,670 శాంపిల్స్ పరీక్షించగా మొత్తం 1,916 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించారు. అదే సమయంలో 952 మంది కరోనా నుంచి కోలుకున్నారు. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..