అమరావతి: ఏపీలో శనివారం నాడు 24 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 405కు చేరుకుంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు నమోదైన 24 కరోనా పాజిటివ్ కేసుల్లో అధిక భాగం గుంటూరు జిల్లాలోనే వెలుగుచూడటం గమనార్హం. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 17 కొత్త కేసులు నమోదు కాగా కర్నూలు జిల్లాలో 5, ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. కరోనా వైరస్ చికిత్స అనంతరం కోవిడ్ టెస్ట్ నెగటివ్ వచ్చిన 11 మందిని డిశ్చార్జ్‌ చేశారు. ప్రస్తుతం ఆస్పత్రులలో 388 మంది చికిత్స తీసుకుంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్.. డౌట్స్ క్లియర్ చేసిన సీఎం కేసీఆర్


ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 82 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఆ తర్వాతి స్థానంలో గుంటూరు జిల్లాలో 75 కేసులు, నెల్లూరు జిల్లాలో 48 పాజిటివ్ కేసులు, ప్రకాశం జిల్లాలో 41, కృష్ణా జిల్లాలో 35 కేసులు, కడప జిల్లాలో 30, పశ్చిమగోదావరి జిల్లాలో 22, విశాఖపట్నం జిల్లాలో 20, చిత్తూరు జిల్లాలో 20, తూర్పుగోదావరిజిల్లాలో  17, అనంతపురం జిల్లాలో 15 పాజిటివ్ కేసులు ఉన్నాయి. 


Also read : Ban on photography: రేషన్, ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ ఫోటోలపై నిషేధం.. సీఎం ఆర్డర్స్


ఇదిలావుంటే, శనివారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. రాష్ట్రంలో లాక్ డౌన్ పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న రెడ్ జోన్లలో మాత్రమే లాక్ డౌన్ పాటిస్తే సరిపోతుందని వైఎస్ జగన్ సూచించారు. మరోవైపు తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..