'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా 12 గంటల్లోనే 34 పాజిటివ్ కేసులు నమోదు కావడం గుబులు పుట్టిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ సోకకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఐనప్పటికీ గత 12 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. నిన్న సాయంత్రం నుంచి ఇవాళ (బుధవారం) ఉదయం 9 గంటల వరకు 34 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 473కు చేరుకుంది. తాజాగా  గుంటూరు జిల్లాలో 16, కృష్ణా జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 7, అనంతపురం జిల్లాలో 2 నెల్లూరు జిల్లాలో ఒక కేసు చొప్పున నమోదయ్యాయి. 


[[{"fid":"184319","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]][[{"fid":"184320","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


ఐతే మొత్తంగా చూసుకుంటే గుంటూరు జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ జిల్లాలో ఇప్పటికే 109 మంది కరోనా బారిన పడ్డారు. గత 24 గంటల్లో 2010 శాంపిల్స్ పరీక్షించారు వైద్య సిబ్బంది. ఇందులో 41 కరోనా పాజిటివ్ కేసులు కనుగొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 9 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. అలాగే పాజిటివ్ గా వచ్చి చికిత్స తీసుకుని బతికి
బయటపడ్డవారు 14 మంది. .జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..