Coronavirus in AP: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు లేటెస్ట్ అప్డేట్
ఏపీలో జిల్లాల వారీగా బుధవారం వరకు నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వివరాల విషయానికొస్తే... అనంతపురంలో -13, చిత్తూరులో 20, తూర్పు గోదావరి జిల్లాలో 11, గుంటూరు జిల్లాలో -49, కడప జిల్లో 28, కృష్ణా జిల్లాలో -35, కర్నూలు జిల్లాలో 75, నెల్లూరులో 48, ప్రకాశం జిల్లాలో 27, విశాఖపట్నంలో 20, పశ్చిమ గోదావరి -22 కేసులు నమోదు కాగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం.
అమరావతి : ఏపీలో ఏప్రిల్ 8న బుధవారం కొత్తగా 19 కరోనావైరస్ పాజిటివ్ కేసులను గుర్తించినట్టు ఏపీ సర్కార్ ప్రకటించింది. ఈ 19 కేసులతో కలిపి ఏపీలో కరోనా వైరస్ సోకినవారి మొత్తం సంఖ్య 348కి చేరింది. బుధవారం ముగ్గురు కరోనా సోకి, వ్యాధి నయమైన వ్యక్తులు డిశ్చార్జ్ అయ్యారని.. దీంతో ఏపీలో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య మొత్తం 9కి చేరింది. ఈ మేరకు బుధవారం రాత్రి తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్య, ఆరోగ్య శాఖ... అందులో ఈ వివరాలను వెల్లడించింది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమానితులకు కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు జరపగా.. గుంటూరులో 8, అనంతపురంలో 7, ప్రకాశంలో 3, పశ్చిమ గోదావ జిల్లాలో ఒక కేసు నమోదైనట్టు వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ స్పష్టంచేసింది.
Also read : PM Modi about lockdown: లాక్ డౌన్ ఎత్తివేయడంపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
ఏపీలో జిల్లాల వారీగా బుధవారం వరకు నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వివరాల విషయానికొస్తే... అనంతపురంలో -13, చిత్తూరులో 20, తూర్పు గోదావరి జిల్లాలో 11, గుంటూరు జిల్లాలో -49, కడప జిల్లో 28, కృష్ణా జిల్లాలో -35, కర్నూలు జిల్లాలో 75, నెల్లూరులో 48, ప్రకాశం జిల్లాలో 27, విశాఖపట్నంలో 20, పశ్చిమ గోదావరి -22 కేసులు నమోదు కాగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..