అమరావతి: ఏపీలో తొలిసారిగా శుక్రవారం కరోనావైరస్ సోకిన వ్యక్తి చనిపోయారు. విజయవాడకు చెందిన సుభాని అనే వ్యక్తి కరోనా వైరస్  కారణంగా చనిపోయారని ఏపీ సర్కార్ ధృవీకరించింది. సుభానికి ముందు నుంచే ఇతరత్రా వ్యాధులు ఉన్నాయని.. ఆయన ఆసుపత్రిలో చేరిన గంటలోనే చనిపోయారని అధికారవర్గాలు తెలిపాయి. కరోనా లక్షణాలతో చేరిన సుభానికి కోవిడ్-19 పరీక్షలు చేయగా.. పాజిటివ్ అని వచ్చిందని అధికారులు స్పష్టంచేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : కరోనాని జయించిన తెలుగు యువకుడు.. ఏం సలహా ఇచ్చాడంటే!


ఇదిలావుంటే, ఏపీలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శుక్రవారం ఉదయం ఏపీ సర్కార్ జారీ చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఉదయం 9 గంటలకే మరో 19 కరోనావైరస్ పాజిటివ్ కేసులను (Coronavirus positive cases in AP) గుర్తించారు. దీంతో ఏపీలో ఇప్పటివరకు కరోనావైరస్ పాజిటివ్ సోకిన రోగుల సంఖ్య మొత్తం 161కి చేరుకుంది. హెల్త్ బులెటిన్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 32 పాజిటివ్ కేసులు నమోదు కాగా అదృష్టవశాత్తుగా శ్రీకాకుళం, విజయనగరం జిలాల్లో కరోనావైరస్ ఉనికి కనిపించలేదు. కర్నూలు జిల్లాలో ఒకటి, అనంతపురం జిల్లాలో 2 కేసులు వెలుగుచూశాయి. 


Read also : తెలంగాణలో మరో 27 మందికి కరోనా.. 150 దాటిన కేసులు


కృష్ణా జిల్లాలో 23, గుంటూరు జిల్లాలో 20, కడప జిల్లాలో 19, ప్రకాశం జిల్లాలో 17, వెస్ట్ గోదావరి జిల్లాలో 15, విశాఖ జిల్లాలో 14, తూర్పు గోదావరి జిల్లాలో 9, చిత్తూరు జిల్లాల్లో 9 కేసులు నమోదైనట్టు ఏపీ సర్కార్ వెల్లడించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..