Chiranjeevi vs Narayana: సంచలన కామెంట్లతో రాజకీయ కాక రాజేస్తుంటారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏం జరిగినా తనదైన శైలిలో స్పందిస్తుంటారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలపైనా పంచ్ డైలాగులు విసురుతుంటారు. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీలో అన్ని పార్టీలు బీజేపీ కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వడంపై మాట్లాడిన నారాయణ.. వైసీపీ, టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవిపైనా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో నారాయణపై మెగా ఫ్యాన్స్ భగ్గుమన్నారు. సోషల్ మీడియా వేదికగా నారాయణపై విరుచుకుపడుతున్నారు. దీంతో దిగొచ్చారు నారాయణ. మెగాస్టార్ చిరంజీవికి బహిరంగ క్షమాపణలు చెప్పారు. రాజకీయాల్లో విమర్శలు కామన్ అన్న నారాయణ.. ఈ వివాదాన్ని ఇప్పటితో విడిచిపెట్టాలని మెగా ఫ్యాన్స్ కు సూచించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరుపతిలో  మాట్లాడిన సీపీఐ నారాయణ భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహా విష్కరణకు చిరంజీవి హాజరు కావడంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. మోడీ, జగన్ తో కలిసి చిరంజీవి వేదిక పంచుకున్నారు. ఈ విషయంపైనే మాట్లాడిన నారాయణ.. చిరంజీని తీరును తీవ్రంగా తప్పుపట్టారు. చిరంజీవి ఊసరవెల్లితో పోల్చారు. అంతేకాదు చిరంజీవి చిల్లర బేరగాడు అంటూ  నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలో అల్లూరిగా నటించి ప్రేక్షకులకు అల్లూరిని పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణను పిలవకుండా చిల్లర బేరగాడు చిరంజీవిని స్టేజి మీదకు తీసుకువచ్చారని నారాయణ కామెంట్ చేశారు. అల్లూరి విగ్రహావిష్కరణకు పవన్ కళ్యాణ్  వచ్చి ఉంటే గౌరవంగా ఉండేదని వ్యాఖ్యానించారు.


చిరంజీవిని చిల్లర బేరగాడంటూ నారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మెగా ఫ్యాన్స్ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో నారాయణ టార్గెట్ గా పోస్టులు పెట్టారు.  జనసేన నేత , మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు.  సీపీఐ నారాయణ అనే వ్యక్తి చాలా కాలం నుంచి అన్నం తినడం మానేసి కేవలం ఎండు గడ్డి మరియు చెత్తా చెదారం తింటున్నాడని అ్ననారు.  మెగా అభిమానులంతా  దయచేసి వెళ్లి అతనితో గడ్డి తినడం మాన్పించి.. కాస్త అన్నం పెట్టండి. తద్వారా అతను మళ్లీ తెలివి తెచ్చుకుని మనిషిలా ప్రవర్తిస్తాడు అంటూ నాగబాబు ట్వీట్లు చేశారు. మెగా ఫ్యామిలీ సీరియస్ గా స్పందించడం.. మెగా అభిమానుల ఆగ్రహంతో వెనక్కి తగ్గారు నారాయణ. చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. 


Read also: Srilanka Crisis:ఏపీ, తెలంగాణలో  శ్రీలంక పరిస్థితులు రాబోతున్నాయా.. కేంద్ర సర్కార్ ప్రజెంటేషన్ తో కలకలం!


Read also: Neet Dress Code: లోదుస్తులు చేతుల్లోనే పట్టుకుని వెళ్లమన్నారు.. బాధిత విద్యార్థిని ఆవేదన.. ఐదుగురు మహిళా సిబ్బంది అరెస్ట్..  



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook