ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విభజన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిణామం అనేక కేసులను ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా జగన్ కేసులో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీని గురించి తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీబీఐ కోర్టు జడ్డి బదిలీ..!
ఫ్రముఖ మీడియా కథనం ప్రకారం హైకోర్టు విభజన నేపథ్యంలో జగన్ కేసు విచారిస్తున్న సీబీఐ కోర్టు జడ్డి వెంకట రమణ ఏపీకి బదిలీకి అయ్యారు.ఈ నేథప్యంలో కొత్త జడ్జి నియామకం జరిగే వరకు ఈ విచారణ వాయిదా పడింది. ఈ నెల 25 న నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు కొత్త జడ్జి నియమించే అవకాశముంది. ఈ నేపథ్యంలో మళ్లీ జగన్ ఆ రోజు కోర్టుకు హాజరుకావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది


జగన్ కేసు మళ్లీ మొదటికేనా ?
జగన్ ఆస్తుల కేసులో మొత్తం 11 ఛార్జ్ షీట్లు నమోదు కాగా..వాటిలో మూడు ఛార్జ్ షీట్లు పై గత మూడేళ్లుగా విచారణ కొనసాగుతోంది. తాజాగా ఈ కేసు విచారిస్తున్న జడ్జి బదిలీ కావడంతో కేసు మళ్లీ మొదటి నుంచి విచారణ జరగే అవకాశముందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. 


చంద్రబాబు చెప్పినట్లుగానే ....
హైకోర్టు విభజన పరిణామంపై ఏపీ సీఎం స్పందిస్తూ జగన్ ను కేసుల నుంచి తప్పించేందుకు కేంద్రం చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. హైకోర్టు విభజన జరిగిన నేపథ్యంలో సీబీఐ కోర్టు విభజన కూడా జరుగుతుందని.. ఈ పరిణామంతో జగన్ కేసు మరుగున పడే అవకాశముందని  విమర్శించారు. ఎన్నికల వరకు జగన్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మోడీ సర్కార్ ఇలాంటి హైకోర్టు విభజనపై ఆకస్మాత్తు నిర్ణయం తీసుకుందని చంద్రబాబు ఆరోపణలు సంధించారు. చంద్రబాబు విమర్శలకు తాజా పరిణామాల బలాన్ని చేకూర్చేలా ఉండటం గమనార్హం.