Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. వాయుగుండంగా మారి ఆ తరువాత తుపానుగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో రాత్రి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. బయటికొచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాతావరణ శాఖ ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అందుకు తగ్గట్టే ఈ జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరులో పరిస్థితి తీవ్రంగా ఉంది. భారీ వర్షాల కారణంగా బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. స్కూళ్లకు ఇప్పటికే సెలవులు ప్రకటించారు. తుపానుగా మారిన తరువాత ఈ నెల 17వ తేదీన నెల్లూరు-చెన్నై మద్య తీరం దాటవచ్చని అంచనా. తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని ఐఎండీ వెల్లడించింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేసేందుకు అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం తీరం వెంబడి గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. మరోవైపు ప్రత్యేక ఆంబులెన్స్‌లు, వాహనాలు రెడీగా ఉన్నాయి. 


తుపాను విపత్తును ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీ చేసింది. ప్రతి రెండు గంటలకోసారి సమీక్షిస్తున్నారు. ఇప్పటికే ఈ జిల్లాల్లోని పర్యాటక కేంద్రాల్ని మూసివేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 


అటు తిరుమల, తిరుపతిలో కూడా ఇవాళ ఉదయం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా తిరుమలలో వర్షాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంగా తిరుమలకు సంబంధించి వీఐపీ బ్రేక్ దర్శన్‌ను నిలిపివేస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది. అక్టోబర్ 15 వరకూ ఎలాంటి లేఖలు అనుమతించమని తెలిపింది. 


Also read: DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ నజరానా, డీఏ పెంపుతోపాటు డీఏ ఎరియర్లు కూడా అందున్నాయా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.