Cyclone Gulab live updates, Cyclone Gulab hits coastal Andhra near Kalingapatnam: విశాఖపట్నం: గులాబ్ తుపాను ఆదివారం రాత్రి 7.30 గంటల నుంచి 8.30 గంటల మధ్య తీరం దాటింది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి ఉత్తరాన 20 కిమీ దూరంలో గులాబ్ తుపాన్ తీరాన్ని తాకింది. గులాబ్ తుపాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ ఒడిషాలో భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. తుపాను తీరం తాకిన సమయంలో గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో గాలులు వీశాయి. గాలుల వేగానికి భారీ వృక్షాలు, విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి. దీంతో అనేక చోట్ల రహదారులపై వాహనాల రాకపోకలతో పాటు విద్యుత్ సరఫరా సైతం నిలిచిపోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Cyclone Gulab affected areas: గులాబ్ తుపాను ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాలు:
ఏపీలో శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరు, గార, మందస, నర్సన్నపేట, కవిటి, గొల్లవానిపేట, పలాస, శ్రీకాకుళం, రణస్థలం, సంతబొమ్మాళి మండలాల్లో గులాబ్ తుపాను ప్రభావం అధికంగా కనిపించింది. అలాగే విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోనూ గులాబ్ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. ఒడిషాలోని గోపాల్‌పూర్ ప్రాంతాల్లో తుపాన్ ప్రభావం అధికంగా కనిపించింది.


Also read : PM Modi on Gulab Cyclone: గులాబ్ తుపానుపై వైఎస్ జగన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ


Death toll of Cyclone Gulab - గులాబ్ తుపాను ధాటికి ముగ్గురు మృతి:
గులాబ్ తుపాను కారణంగా ఏపీలో ఇద్దరు, ఒడిషాలో ఒకరు మృతి చెందారు. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో ఇద్దరు మత్స్యకారులు తుపాను బీభత్సానికి బలయ్యారు. ఒడిషాలో (Cyclone Gulab in Odisha) మరొకరు తుపాన్ ధాటికి మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలో తీర ప్రాంత వాసుల కోసం 61 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తీర ప్రాంతాల వారిని సురక్షితంగా అక్కడికి తరలించారు.


Heavy rain lashes parts of AP - ఏపీలో అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు:
శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో (Kalingapatnam) 19.4 సెంటీమీటర్లు, ఎచ్చెర్లలో 11.2 సెంటీమీటర్లు, నర్సన్నపేటలో 10.6 సెంటీమీటర్లు, నిమ్మాడలో10.1 సెంటీమీటర్లు, రాగోలులో 9 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు కాగా విశాఖపట్నం (Visakhapatnam) జిల్లా అడవివరంలో13.6 సెంటీమీటర్లు, ధారపాలెంలో 9.8 సెంటీమీటర్లు, గాజువాకలో 8.9 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. మొత్తానికి గులాబ్ తుపాను (Cyclone Gulab live updates) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పలు చోట్ల బీభత్సాన్ని సృష్టించి భారీ ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. 


Also read: Gulab Cyclone: రైల్వేపై '‘గులాబ్'’ తుపాను ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారిమళ్లింపు..


Also read : Heavy rain due to Cyclone Gulab: తెలంగాణ, ఉత్తరాంధ్రకు ఆరెంజ్‌ అలర్ట్‌.. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook