Michaung Cyclone: తుపాను ప్రభావం తీవ్రమే, అతి భారీ వర్షాల హెచ్చరిక, ప్రభుత్వం అప్రమత్తం
Michaung Cyclone: బంగాళాఖాతంలో తుపాను ముప్పు ఏపీపై తీవ్రంగా ఉండనుంది. ఇప్పటికే తీవ్రరూపం దాల్చిన వాయుగుండం రేపటికి తుపానుగా మారనుంది. ఏపీలో అతి భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Michaung Cyclone: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. రేపు అంటే ఆదివారం ఉదయానికి తుపానుగా పరివర్తన చెంది ఏపీవైపుకు దూసుకురానుంది. డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం మచిలీపట్నం సమీపంలో తీరం దాటే అవకాశాలున్నాయని ఐఎండీ అంచనా వేస్తోంది.
ఏపీకు మరో 24 గంటల్లో మిచౌంగ్ తుపాను ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా బంగాళాఖాతంలో పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశలో 440 కిలోమీటర్లు, చెన్నైకు 420 కిలోమీటర్లు, నెల్లూరుకు 650 కిలోమీటర్లు, మచిలీపట్నానిిక 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న ఈ తుపానుకు మయన్మార్ దేశం సూచించిన మిచౌంగ్ పేరు పెట్టారు. రేపు అంటే డిసెంబర్ 3 ఉదయానికి తుపానుగా మారిన తరువాత ఏపీవైపుకు దూసుకురానుంది. డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటనుంది.
తుపాను ఏపీవైపుకు దూసుకొస్తుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాల యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. తుపాను తీవ్రత అంచనాలకు మించి ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా 2010లో వచ్చిన లైలా తుపానుతో పోల్చుతున్నారు. తుపాను ప్రభావంతో తిరుపతి,నెల్లూరు నుంచి ఉత్తరాంధ్ర వరకూ కోస్తా తీరం వెంబడి భారీ వర్షాలు పడతాయాని ఐఎండీ వెల్లడించింది. ఆది, సోమ, మంగళవారాల్లో మాత్రం అతి భారీ వర్షాలు పడవచ్చు. కోస్తాతీరంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.
ఏపీలో మిచౌంగ్ తుపాను ప్రభావం నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, ఏలూరు, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలపై తీవ్రంగా ఉండవచ్చని తెలుస్తోంది. సోమవారం అంటే డిసెంబర్ 4 వతేదీన అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి.
Also read: Michaung Cyclone Alert: ఏపీకు తుపాను ముప్పు, డిసెంబర్ 5 వరకూ భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook