IIIT Exam Postponed: ట్రిపుల్ ఐటీ పరీక్ష వాయిదా
నివర్ తుఫాను కారణంగా (Cyclone Nivar Effect) దక్షిణ భారతదేశంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావంతో ఏపీలో ట్రిపుల్ ఐటీ పరీక్షలను వాయిదా (IIIT Exams Postponed in AP) వేశారు.
దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో నివర్ తుఫాను పెను ప్రభావం చూపింది. ఆ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరుసగా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో నివర్ తుఫాను ప్రభావం కనిపిస్తోంది. తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో పలు పరీక్షలకు ఆటంకం తలెత్తింది. దీంతో ప్రతికూల పరిస్థితుల్లో ట్రిపుల్ ఐటీ పరీక్షను నిర్వహించలేమని, పరీక్షను వాయిదా వేస్తూ (IIIT Exams Postponed in AP) నిర్ణయం తీసుకున్నారు.
నివర్ తుపాను (Cyclone Nivar) ప్రభావిత జిల్లాల్లో పరీక్ష నిర్వహణకు వాతావరణం అనుకూలించని కారణాలతో ఆంధ్రప్రదేశ్‌లో రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన ట్రిపుల్ ఐటీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఆర్‌జీయూకేటీ కన్వీనర్ హరినారాయణ ఓ ప్రకటనలో వెల్లడించారు. ట్రిపుల్ ఐటీ పరీక్షను డిసెంబర్ 5వ తేదీన నిర్వహించేందుకు షెడ్యూల్ చేసినట్లు తెలిపారు.
Also Read : CBSE Scholarship 2020: ఇలా చేస్తే ఆ విద్యార్థులకు ప్రతినెలా డబ్బులు!
అభ్యర్థులు పరీక్షపై ఏ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కన్వీనర్ సూచించారు. అదే పరీక్షా కేంద్రాలలో, అభ్యర్థులు ఇదివరకే డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్లతో డిసెంబర్ 5వ తేదీన పరీక్షకు హాజరు కావొచ్చునని స్పష్టం చేశారు. అయితే ఏదైనా ఒక గుర్తింపు కార్డుతో రెండు గంటలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe