Cyclone Updates: సిత్రాంగ్‌ తుపాను హెచ్చరికలు కలవరపాటుకు గురిచేస్తోంది. బంగాళాఖాతంలో క్షణక్షణం దిశను మార్చుకుంటున్న తుపాను.. ఏపీ, ఒడిశా రాష్ట్రాల గుండా తీరం దాటే అవకాశం కనిపిస్తుండడంతో తీర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే వరుసగా భారీ వర్షాలతో అతలాకుతమైన తీరప్రాంతం.. మరోసారి తుపాను హెచ్చరికల నేపథ్యంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సిత్రాంగ్‌ తుపాను ఎలాంటి బీభత్సం సృష్టిస్తుందోనని భయపడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. రేపు (ఈ నెల 20) బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అనంతరం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ఈ నెల 22 తరువాత ఏ క్షణమైనా వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ తరువాత మరింత బలపడి తుపానుగా మారుతుందని చెప్పారు. 


సిత్రాంగ్‌ తుపాను ప్రభావంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో 2 రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నెల 21, 22 తేదీల్లో 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. చేపల వేట కోసం జాలర్లు సముద్రంలోకి వెళ్లొద్దని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. తుపాను నేపథ్యంలో విపత్తు నిర్వహణ యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉందన్నారు.  


ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు. సిత్రాంగ్ తుపాను తీరం ఎక్కడ దాటనుందో ఇంకా స్పష్టం కాలేదన్నారు. ఇంకా అల్ప పీడనం ఏర్పడిన ప్రాంతం స్పష్టంగా తెలియడం లేదని.. తుపాను ప్రభావం, తీరం దాటే ప్రాంతం వివరాలను ధ్రువీకరించడం సాధ్యపడడం లేదన్నారు. తుపాను కదలికపై అనుక్షణం అప్రమత్తంగా ఉన్నామని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 


Also Read: Minister Srinivas Goud: తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆర్.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ జోస్యం


Also Read: South Indian Congress Presidents: కాంగ్రెస్ అధ్యక్షులుగా దక్షిణాది వ్యక్తులు ఎంతమంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook