Dana Cyclone Alert: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారింది. ఆ తరువాత ముందుగా ఊహించినట్టే దానా తుపానుగా మారింది. రేపు ఉదయానికి తీవ్ర తుపానుగా మారి శుక్రవారం ఉదయంలోగా తీరం దాటనుందని ఐఎండీ వెల్లడించింది. తుపాను ప్రభావం పశ్చిమ బెంగాల్, ఒడిశాలపై తీవ్రంగా, ఏపీలో కొద్దిగా ఉండనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను తీవ్ర తుపానుగా మారి రేపు రాత్రి నుంచి అంటే గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాములోగా పూరీ-సాగర్ మధ్య తీరం దాటనుంది. ప్రస్తుతం పారాదీప్‌కు 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న దానా తుపాను గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతం ఈ తుపాను బంగాళాఖాతంలో నైరుతి దిశగా ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంవైపు వేగంగా కదులుతోంది. ఈ నెల 24 వ తేదీ రాత్రి నుంచి 25వ తేదీ ఉదయంలోగా తీరం దాటవచ్చు. ఒడిశాలోని ధమారా వద్ద తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు పడనున్నాయి. తీరం దాటే సమయంలో గంటకు 100-120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బన్‌లో కూడా తుపాను ప్రభావం కన్పించనుంది. సముద్రంలో కెరటాలు 1-2 మీటర్ల ఎత్తున ఎగిసిపడవచ్చు. కోల్‌కతా, ధమారా పోర్ట్‌లో ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. 


ఇక దానా తుపాను ప్రభావం ఏపీలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగంర జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఈదురుగాలులు బలంగా వీస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో శుక్రవారం ఉదయం భారీ వర్షాలు పడనున్నాయి. ఇవాళ, రేపు సముద్రం అలజడిగా ఉండనుంది. ఉత్తరాంధ్రలోని పోర్టుల్లో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయింది. 


Also read: Big Shock to Ys Jagan: వైఎస్ జగన్‌‌కు షాక్ ఇచ్చిన కీలక నేతలు, పార్టీకు రాజీనామా, ఘాటు విమర్శలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.