దసరా హడావుడి మొదలైంది...
..
విజయవాడ: దసరా ఉత్సవాలు ప్రారంభమవడానికి ఇంకా 27 రోజులు మాత్రమే ఉన్నాయి. మహోత్సవాల సమయంలో ఇంద్రకీలాద్రీపై వెలసిన దుర్గమ్మను దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తారనే అంచనాతో ఉన్న అధికారులు ఇప్పటి నుంచే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రోజులు సమీపిస్తుండటంతో అధికారులు ఇప్పటి నుంచే పరుగులు పెడుతున్నారు. తమ తమ పనుల్లో బీజీ బీజీగా తిరుగుతున్నారు.
ఇంద్రకీలాద్రి దసరా షెడ్యూల్...
సెప్టెంబర్ 21న దసరా ప్రారంభం రోజు ఉదయం 8 నుంచి మాత్రమే భక్తులకు దుర్గమ్మ దర్శనానికి అనుమతి ఇస్తారు. ఆ తర్వతి రోజు నుంచి ప్రతి రోజు తెల్లవారుజామున 3 నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శన సౌకర్యం ఉంటుంది. మూల నక్షత్రం రోజు మాత్రం తెల్లవారుజామున 2 గంటలకే దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తారు.
ప్రత్యేక కుంకుమార్చనలు ప్రతి రోజూ 7 గంటల నుంచి 9 గంటల వరకు ..తిరిగి 10 నుంచి 12 గంటల వరకు..మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు ..తిరిగి సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు జరుగుతాయి. ఒక్కో సెషల్ లో 200 మంది దంపతులకు మాత్రమే అనుమతి ఇస్తారు. ఎవరు ఏ షెషన్ లో పాల్గొనాలను కుంటే.. ఆ సెషన్ కు సంబంధించిన టికిట్లు కొనుగోలు చేయాల్సి ఉంది. కాగా చివరి రోజు అంటే సెప్టెంబర్ 30వ తేదీన కులశ ఉద్వాసన, తెప్పోత్సవం, పూర్లాహుతి వంటివి జరుగుతాయి.
27న పట్టువస్త్రాల సమర్పణ...
సెప్టెంబర్ 27న మూలనక్షత్రాన్ని పురస్కరించుకొని ఆ రోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీ సీఎం చంద్రబాబు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ కార్యక్రమానికి పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారు.
వీఐపీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు..
పున్నమిఘాట్ వద్ద వీఐపీల దర్శనాల కోసం ప్రత్యేక ఫ్రోటోకాల్ విభాగం ఏర్పాటు చేయనున్నారు. రెవెన్యూ, పోలీసు, న్యాయవిభాగాల నుంచి ప్రత్యేకంగా కొండపై ప్రొటోకాల్ విభాగాలు. కొండపై చేరుకోవడానికి ప్రత్యేక వాహనాల ఏర్పాటు చేస్తున్నారు. వీఐపీలకు ఉదయం 6 నుంచి 8 వరకు..అలాగే మధ్యాహ్నం 3 నుంచి 4 గంటలకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయనున్నారు.