Swatchh Andhra Corporation Funds: 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అకౌంట్‌లో రూ.2092.65 కోట్ల నిధులు ఉంటే.. ప్రస్తుతం కేవలం రూ.7 కోట్లు మాత్రమే మిగిల్చారా..? అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విస్తుపోయారు. బుధవారం మంగళగిరిలోని నివాసంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలు, కార్పొరేషన్‌కు ఉన్న నిధులు, రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణపై ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ పాలన సమయంలో కార్పొరేషన్ నిధులు మళ్లింపు అంశంపై సుదీర్ఘంగా చర్చించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Padi Kaushik reddy: బ్లాక్ బుక్ లో మొదటి పేరు ఆ మినిస్టర్ దే.. కీలక వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి..


2020-21లో రూ.728.35 కోట్లు మాత్రమే ఈ కార్పొరేషన్ వినియోగించిందని చెప్పిన పవన్.. 2021-22లో రూ.508 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. ఆ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.1066.36 కోట్లు ఖాతాలో ఉన్నాయని.. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యేనాటి కార్పొరేషన్ ఖాతాలో రూ.3 కోట్లు మాత్రమే ఉన్నాయని రికార్డుల్లో ఎలా నమోదైందని అధికారులను ప్రశ్నించారు. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని.. నిధులు ఎటు వెళ్లాయి..? ఏం చేశారో చెప్పాలని ఆదేశించారు. ఆ ఆర్థిక సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రూ.70 కోట్ల అందించగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు అందించిందని.. రూ.46 కోట్లు ఖర్చు చేసిందన్నారు. 


2023-24లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులు, వాటిపై వచ్చిన వడ్డీతో రూ.239 కోట్లు నిధులు సమకూరాయని.. రూ.209 కోట్లు మేర ఖర్చు చేశారని మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికీ మిగిలినవి రూ.7.04 కోట్లు మాత్రమేనని.. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు సక్రమంగా వినియోగమైతేనే ఈ సంస్థకు నిర్దేశించిన లక్ష్యాలు అందుకోగలమన్నారు. ప్రధాని మోదీ మంచి ఉద్దేశంతో ప్రజారోగ్యం కోసం స్వచ్ఛ భారత్ మిషన్ తీసుకువచ్చారని.. అందులో భాగంగానే స్వచ్ఛాంధ్ర ఏర్పాటైందన్నారు. 


స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లక్ష్యాలను గాలికి వదిలేసి, వ్యవస్థలను నిర్వీర్యం చేసేశారని గత పాలకులపై డిప్యూటీ సీఎం ఫైర్ అయ్యారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2092 కోట్లు నిధి ఉంటే.. ఇప్పుడు జీతాలకు సరిపడా నిధులు మాత్రమే ఖాతాలో ఉండే  పరిస్థితి ఎందుకు వచ్చింది..? అధికారులను నిలదీశారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌లో నిధుల మళ్లింపుపై మరింత లోతుగా సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. నిధులు ఎక్కడికి మళ్లించారో..? ఎవరి ఆదేశాలతో ఆ పని చేశారో కూడా తెలియజేయాలని స్పష్టం చేశారు. 


Also Read: Pinnelli Arrested: వైసీపీకి వరుస షాకులు.. మాచర్ల  మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి