Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి చుట్టే తిరుగుతున్నాయి. మన్మోహన్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పని చేసిన చిరంజీవి.. రాష్ట్ర విభజన తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మళ్లీ సినిమాలు తీసుకుంటూ పొలిటిక్స్ వాసనే లేకుండా చూసుకుంటున్నారు. అయితే ఎనిమిదేళ్లుగా రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి.. జూలై4న భీమవరంలో జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో పాల్గొన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు హాజరయ్యారు. ప్రధాని మోడీ, ఏపీ సీఎం జగన్ తో కలిసి వేదిక పంచుకున్నారు. ఈ సభే ఇప్పుడు ఏపీలో చర్చగా మారింది. నిజానికి అల్లూరి జయంతి వేడుకను రాజకీయాలకు అతీతంగా నిర్వహించామని కేంద్ర పర్యాటక- సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పినా.. సభ చుట్టూ రాజకీయమే సాగుతోంది. వేదికపై చిరంజీవితో ప్రత్యేకంగా మాట్లాడారు ప్రధాని మోడీ. దీంతో చిరంజీవి బీజేపీ గాలం వేస్తుందనే ప్రచారం తెరపైకి వచ్చింది. చిరంజీవిని బీజేపీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నియమించనున్నారనే వార్తలు కూడా వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా చిరంజీవికి సంబంధించి మరో ఆసక్తికర ఆంశం ప్రచారంలోనికి వచ్చింది. మెగాస్టార్ కు ప్రధాని  మోడీ  బంపర్ ఆఫర్ ఇచ్చారని.. కాని ఆ అఫర్ ను చిరంజీవికి తిరస్కరించారనే టాక్ వస్తోంది. చిరంజీవి కాదనడంతో ఆ ఆఫర్ బహాబలి డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ కు దక్కిందని అంటున్నారు. చిరంజీవికి రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సీటు ఇస్తామని బీజేపీ హైకమాండ్ ఆఫర్ ఇచ్చిందని తెలుస్తోంది. దీనిపై కొన్ని రోజుల క్రితమే ఢిల్లీ పెద్దల నుంచి చిరంజీవి సమాచారం వచ్చిందట. భీమవరం సభ రోజున కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ జీవీఎల్ దీనిపై మరోసారి చిరంజీవితో మాట్లాడారని చెబుతున్నారు. అయితే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న చిరంజీవి.. ఆ ఆఫర్ ను తిరస్కరించారని తెలుస్తోంది. భీమవరం ప్రధాని పర్యటనకు సంబంధించి ఏపీలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను ఈ వేడుకకు పిలుపు లేదట. సభకు రెండు రోజుల ముందు కిషన్ రెడ్డి ఫోన్ చేసి పవన్ ను ఆహ్వానించారని తెలుస్తోంది. కాని చిరంజీవీకి మాత్రం అధికారికంగా లేఖ వెళ్లింది. చిరంజీవిని మచ్చిక చేసుకునే ప్రయత్నంలోనే అతనికి భీమవరం సభ ఆహ్వానం వచ్చిందని అంటున్నారు.


ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేసిన హైకమాండ్.. ఏం చేయాలన్న దానిపై పెద్ద ఎత్తున కసరత్తు చేసిందని తెలుస్తోంది. ఏపీలో బలమైన సామాజిక వర్గమైన కాపులను తమవైపు తిప్పుకోవాలని ప్లాన్ చేసిందని సమాచారం. అందులో భాగంగా చాలా రోజుల క్రితమే బీజేపీ నుంచి రాజ్యసభ సీటు ఇస్తామని కేంద్రం పెద్దల నుంచి చిరంజీవికి సమాచారం వచ్చిందట. చిరంజీవి సానుకూలంగా లేకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారట కమలం నేతలు. అయితే పార్టీ నుంచి పెద్దల సభకు పంపిస్తే బీజేపీ ముద్ర ఉంటుందని.. రాష్ట్రపతి కోటాలో అయితే ఏ సమస్య ఉండదని బీజేపీ పెద్దలు కొత్త ఆలోచన చేశారని అంటున్నారు. జనసేన- బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న పవన్ కల్యాణ్ కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీతో పొత్తు దిశగా సంకేతాలు ఇస్తున్నారు. అందుకే ముందస్తుగా చిరంజీవితో బీజేపీ రాజకీయం చేయాలని చూసిందని భావిస్తున్నారు. పవన్ టీడీపీతో వెళ్లిన కాపు వర్గం ఓట్లను గంపగుత్తగా దక్కించుకునేందుకు చిరంజీవిని అస్త్రంగా వాడుకోవాలని బీజేపీ పెద్దలు ప్రణాళిక వేశారని ఢిల్లీ వర్గాల టాక్. అయితే రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి లేని చిరంజీవి రాష్ట్రపతి కోటాలో వచ్చిన రాజ్యసభ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది. దీంతో ఏపీకే చెందిన విజయేంద్ర ప్రసాద్ ను రాజ్యసభ సీటు  వరించిందనే ప్రచారం సాగుతోంది.


Also Read: Secunderabad Agnipath Violence: నన్ను ఇరికించారు.. సికింద్రాబాద్ ఘటనపై పోలీసుల విచారణలో ఆవుల సుబ్బారావు..


Also Read: Boris Johnson: అక్కడ డొనాల్ట్ ట్రంప్.. ఇక్కడ బోరిస్ జాన్సన్! పిచ్చి పనులే కొంప ముంచాయా?



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.



Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook