సులభతర వ్యాపార నిర్వహణ‌లో తెలుగు రాష్ట్రాలు సత్తచాటి టాప్ ప్లేస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 98.42 శాతం స్కోరుతో ఏపీ తొలిస్థానంలో నిలువగా.. 98.33 శాతం స్కోరుతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. గత  ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండూ సమానమైన మార్కులతో అగ్రస్థానాన్ని పంచుకోగా ఈసారి తెలంగాణను నవ్యాంధ్ర వెనక్కి నెట్టింది. ఈ అంశంపై తెలంగాణ మంత్రి కేటీఆర్, ఏపీ మంత్రి నారా లోకేష్ లు స్పందించారు.
 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేటీఆర్ ట్వీట్
తాజా ర్యాంకింగ్స్‌పై తెలంగాణ ఐటీ మంత్రి కేటీయార్ ట్విట్టర్‌లో స్పందిస్తూ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈవోడీబీ)లో కేవలం 0.09% తేడాతో తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ ర్యాంక్ కోల్పోయింది. ఏది ఏమైనప్పటికీ మంచి స్థానంలోనే నిలిచాం.  సీఎం కేసీఆర్‌ స్ఫూర్తిదాయకమైన నాయకత్వంలో పని చేస్తూ కార్యనిర్వహక వర్గం ఈ ఏడాది కూడా మంచి ర్యాంకు సాధించేలా చేసిందన్నారు. ఇదే సందర్భంలో చంద్రబాబు నాయకత్వంలో ఈవోడీబీలో తొలి  ర్యాంకు సాధించిన ఆంధ్రప్రదేశ్‌కు కేటీఆర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.  


నారా లోకేష్ రీ ట్వీట్...
కేటీయార్ ట్వీట్‌పై ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ ఆసక్తికరంగా స్పందించారు. ఇక్కడ ఒకటీ, రెండు పాయింట్ల తేడా అనేది ఏదీ లేదు. తెలుగు రాష్ట్రాలు టాప్‌లో నిలిచాయి. ఇది మన తెలుగు ప్రజల అభివృద్ధికి దోహదపడుతుంది. మీకు కూడా  అభినందనలు’’ అంటూ రీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.