Diwali Village: ఆ ఊరి పేరు దీపావళి.. ఎక్కడుందో తెలుసా..? ఆ ఊరికి అల్లుడు అయితే బంపరాఫర్
Diwali Village in South India: శ్రీకాకుళంలో ఉండే ఈ ఊరి పేరు దీపావళి..ఈ ఊరికి ఆ పేరు ఎలా వచ్చింది. ఈ ఊరికి దీపావళి పండగకు ఉన్న సంబంధం ఏంటి..? ఈ ఊరిలో ఉండే వింత ఆచారాలు ఏంటో తెలుసుకుందాం..
Diwali Village in South India: దీపావళి పండగ ప్రపంచ వ్యాప్తంగా హిందువులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ పండుగను దీపాల పండగ అని పిలుస్తారు. ఈరోజు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా వేడుక నిర్వహించుకుంటారు. దీపావళి పండగ రోజు ఒక్కో రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దీపావళి పేరిట ఏకంగా ఒక గ్రామమే ఉంది. అవును మీరు విన్నది నిజమే శ్రీకాకుళం లోని ఓ గ్రామం పేరు దీపావళి అని పెట్టుకున్నారు. దీనికి ఒక చరిత్ర ఉంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీకాకుళం జిల్లా గార మండలంలో దీపావళి గ్రామం ఉంది. ఇక్కడ ఐదు రోజుల పాటు దీపావళి పండుగను జరుపుకుంటారు. తమ పూర్వీకులను పూజించిన తర్వాతే ఈ పండుగను జరుపుకుంటామని ఇక్కడి వాసులు చెబుతారు. గ్రామంలోని ఈ ప్రత్యేక సంప్రదాయం వెనుక ఓ ఆసక్తికరమైన కథనం ఉంది.
కథ ఏమిటంటే, పూర్వకాలంలో శ్రీకాకుళంలో ఒక రాజు ఉండేవాడు. అతను ఈ గ్రామం మీదుగా వెళ్తూ ఆ రాజు శ్రీ కూర్మనాథ్ ఆలయాన్ని సందర్శించి తిరిగి వస్తుండగా స్పృహ తప్పి పడిపోయాడు. గ్రామస్థులు పరిగెత్తుకుంటూ వచ్చి దీపాలు వెలిగించి సపర్యలు చేశారు. రాజుకి స్పృహ రాగానే ఆ ఊరు పేరు అడిగాడు. ఈ గ్రామానికి పేరు లేదని గ్రామస్తులు తెలిపారు. అప్పుడు రాజు, "మీరు నాకు దీపాల వెలుగుతో సేవ చేసారు కాబట్టి ఈ గ్రామానికి దీపావళి అని పేరు పెట్టాను" అన్నాడు. అప్పటి నుండి ఈ గ్రామం దీపావళిగా పిలుస్తున్నారు.
Also Read: Gold News: ధన త్రయోదశి రోజు భారీగా తగ్గిన బంగారం ధర ఈరోజు బంగారం కొంటున్నారా? అయితే మీకు బంపర్ ఆఫర్
దీపావళి రోజున గ్రామ ప్రజలు తెల్లవారుజామున నిద్రలేచి పూజలు, పితృ కర్మ చేస్తారు. ఇక్కడి ఎక్కువగా సోనాడి కమ్యూనిటీ ప్రజలు ఉంటారు. వీరు ఈ రోజున పితృపూజ చేసి, తమ పూర్వీకుల దీవెనలు పొందేందుకు కొత్త బట్టలు ధరిస్తారు. దీపావళి సమయంలో, సంక్రాంతి నాడు జరిగినట్లే ఇక్కడ కూడా తన అత్తమామల ఇంటికి వచ్చిన అల్లుడికి స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఆచారాలు పాటిస్తారు. ప్రస్తుతం దీపావళి గ్రామ జనాభా సుమారు 1,000 ఈ పండుగను ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటారు. గ్రామ ప్రజలు దీపాలు వెలిగించి, మిఠాయిలతో ఈ పండుగను జరుపుకుంటారు.
అంతేకాదు కొత్త అల్లుడికి ప్రత్యేకంగా బట్టలు పెట్టి సకల మర్యాదలు చేస్తారు అయితే చాలా కాలంగా ఈ గ్రామానికి ఉన్న ప్రత్యేక పేరు కారణంగా వార్తల్లో నిలుస్తోంది దీపావళి పండగ వచ్చినప్పుడల్లా ఈ గ్రామాన్ని గుర్తుచేసుకోవడం అనేది పరిపాటిగా మారింది.
Also Read: Gold Delivery: బిగ్‌బాస్కెట్ బంపర్ ఆఫర్.. 10 నిమిషాల్లో బంగారం, వెండి మీ ఇంటికే డెలివరీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి