Vaikunta Dwara Darshan: జనవరి నెలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం వీఐపీలు సిఫారసు లేఖలు పంపొద్దని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. జనవరి 12 నుంచి జనవరి 22 అర్థరాత్రి వరకు సిఫారసు లేఖలు పంపవద్దని ఆయన తెలిపారు. ఆన్ లైన్ లో ముందుగానే దర్శనం టికెట్ బుక్ చేసుకున్న సామాన్య భక్తుల కోసం తీసుకున్న నిర్ణయానికి సహకరించాలని ఆయన కోరారు. ఒకవేళ వీఐపీ కుటుంబాలు స్వయంగా వస్తే వారికి దర్శనాలకు కల్పించేదుకు సిద్ధంగా ఉన్నామని సుబ్బారెడ్డి చెప్పారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పది రోజుల పాటు ఛైర్మన్ కార్యాలయం లో కూడా సిఫారసు లేఖలు స్వీకరించబోమని టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. కోవిడ్ కారణంగా తిరుమలలో గదుల మరమ్మతులు చేపట్టినందువల్ల  వైకుంఠ ఏకాదశి రోజున ప్రజా ప్రతినిధులకు  తిరుమలలోని నందకం, వకుళ ఆథితి గృహాల్లో వసతి కల్పిస్తున్నామని చెప్పారు. ఒకవేళ తిరుమలలో వసతి సరిపోకపోతే  తిరుపతిలోనే బస పొందేందుకు సిద్ధపడి రావాలన్నారు.


శ్రీవాణి ట్రస్ట్ భక్తులు తిరుపతిలోని మాధవం, శ్రీనివాసం, శ్రీ పద్మావతి నిలయం, ఎస్వీ గెస్ట్ హౌస్ లో వసతి పొందాలని చైర్మన్ తెలిపారు. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా వీఐపీల దర్శన సమయం వీలైనంత తగ్గించి, సామాన్య భక్తుల ఎక్కువ సమయం దర్శనం కేటాయించాలని ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుందని వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.  


Also Read: Sankranthi Special Trains: సంక్రాంతికి 10 స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే


Also Read: Andhra Pradesh News: ఏపీలో ముందస్తు ఎన్నికలకు సిద్ధమన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి