కఠిన నిర్ణయాలు తీసుకోవద్దు: బీజేపీ చీఫ్ అమిత్ షా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు ఆదివారం పార్టీ ఎంపీలు, సీనియర్ ఎమ్మెల్యేలు, నాయకులతో ఆదివారం కీలకమైన సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు ఆదివారం పార్టీ ఎంపీలు, సీనియర్ ఎమ్మెల్యేలు, నాయకులతో ఆదివారం కీలకమైన సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై సమావేశంలో చర్చిస్తున్నారు.
ఈ క్రమంలో జాతీయ మీడియా ఛానళ్లలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. బీజేపీ అధినేత అమిత్ షా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసి కూటమిపై పునరాలోచన చేయమని అడిగారని, "కఠిన నిర్ణయాలు" తీసుకోవద్దని చెప్పారని ఒక ప్రముఖ జాతీయ మీడియా ఛానల్ కథనం ప్రసారం చేసింది.
టీడీపీ నేత కే.రామ్మోహన్ రావు మాట్లాడుతూ- ఈ సమావేశంలో బడ్జెట్ గురించి చర్చిస్తారని చెప్పారు. "రాజకీయ కూటమి భిన్నమైనది, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి భిన్నమైనది" అని ఆయన చెప్పారు.
'ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన బడ్జెట్ తో మేము సంతోషంగా లేము. మేము ఎంపీ పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ముఖ్యమంత్రి నిర్ణయం కోసం ఆగాము" అని టీడీపీ అమలాపురం ఎంపీ పాండుల రవీంద్ర బాబు అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఏపీకి మొండిచెయి చూపించడం, రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు కావాల్సిన నిధులు, ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ఎటువంటి నిధులు ఇవ్వకపోవడం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర నిరాశకు లోనయ్యారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్, నెల్లూరు జిల్లాలోని దుగ్గిరాజుపట్నం నౌకాశ్రయం వంటి పలు సమస్యలపై బడ్జెట్ లో కేటాయింపులు జరగలేదని రవీంద్ర బాబు చెప్పారు.