డీఎస్సీ పరీక్షను ఈసారి అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో నిర్వహించే విషయమై ఏపీపీఎస్సీకి, ప్రభుత్వానికి మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. దాదాపు 5 లక్షలకు పైగానే అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఆన్‌‌లైన్‌లో నిర్వహిస్తే.. ఫలితాలను సులభంగా ప్రకటించవచ్చన్న ఉద్దేశంతో ఏపీపీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది.  తెలుగు, తమిళం, ఆంగ్లం, ఒరియా, మరాఠి, ఉర్దూ మాధ్యమాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కావున.. తగినన్ని కంప్యూటర్లు కూడా అందుబాటు ఉండాల్సిన అవసరం ఉందని... అలాగే టెక్నికల్ టీమ్ ఏర్పాటుకు కూడా ఇప్పటికే శ్రీకారం చుట్టాలని పాఠశాల విద్యా శాఖ, ఏపీపీఎస్సీని కోరినట్లు సమాచారం. 2018-19 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తిచేయాలని ఏపీ సర్కారు కోరుకుంటున్నందున పనులను వేగవంతం చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.