Dussehra Special Trains: దసరా వేళ ప్రయాణీకుల రద్దీ, ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైళ్లు
Dussehra Special Trains: దసరా పండుగ వచ్చిందంటే చాలు బస్సులు, రైళ్లు రద్దీగా మారిపోతాయి. అందుకే పండుగ వేళ ఈస్ట్ కోస్ట్ రైల్వే కొన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఆ రైళ్ల వివరాలంటే తెలుసుకుందాం.
Dussehra Special Trains: దసరా పండుగ వచ్చిందంటే చాలు బస్సులు, రైళ్లు రద్దీగా మారిపోతాయి. అందుకే పండుగ వేళ ఈస్ట్ కోస్ట్ రైల్వే కొన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఆ రైళ్ల వివరాలంటే తెలుసుకుందాం.
దసరా ప్రారంభమైపోయింది. బంధువుల ఇళ్లకు వెళ్లేవారితో రైళ్లు, బస్సులు బిజిగా ఉంటున్నాయి. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే(East Coast Railway) ప్రత్యేక పూజా స్పెషల్ రైళ్లను ప్రవేశపెట్టింది. విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య 08579 నెంబర్‌తో వీక్లీ ట్రైన్ అక్టోబర్ 13, 20, 27 తేదీల్లో నడవనుంది. ఈ రైలు విశాఖపట్నంలో రాత్రి 7 గంటలకు బయలుదేరి ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అదే రైలు 08580 నెంబర్‌తో అక్టోబర్ 14, 21, 28 తేదీల్లో సికింద్రాబాద్‌లో సాయంత్రం 7 గంటల 40 నిమిషాలకు బయలుదేరి..ఉదయం 6 గంటల 40 నిమిషాలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
ఇక విశాఖపట్నం-తిరుపతి(Visakhapatnam-Tirupati Special Pooja Train)మధ్య వీక్లీగా అక్టోబర్ 8, 25, నవంబర్ 1 తేదీల్లో మరో ట్రైన్ ప్రవేశపెట్టింది. ఈ రైలు విశాఖపట్నంలో రాత్రి 7 గంటల 15 నిమిషాలకు బయలు దేరి ఉదయం 7 గంటల 30 నిమిషాలకు తిరుపతి చేరుకుంటుంది. అదే రైలు 08584 నెంబర్‌తో తిరుపతిలో అక్టోబర్ 19, 26, నవంబర్ 2 తేదీల్లో రాత్రి 9 గంటల 55 నిమిషాలకు బయలుదేరి..ఉదయం 10 గంటల 20 నిమిషాలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక విశాఖపట్నం-సికింద్రాబాద్(Visakhapatnam-Secunderabad Special Pooja Train)మధ్య 08585 స్పెషల్ నడవనుంది.ఈ రైలు విశాఖపట్నంలో అక్టోబర్ 19, 26, నవంబర్ 2 తేదీల్లో సాయంత్రం 5.35 నిమిషాలకు బయలుదేరి ఉదయం 7 గంటల 10 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అదే రైలు సికింద్రాబాద్ నుంచి 08586 నెంబర్‌తో అక్టోబర్ 20,27 నవంబర్ 3 తేదీల్లో రాత్రి 9 గంటల 5 నిమిషాలకు బయలుదేరుతుంది.
Also read: AP Corona Update: ఏపీలో కరోనా సంక్రమణ, గత 24 గంటల్లో కొత్తగా 629 కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook