Delhi Earthquake: ఢిల్లీలో భారీ భూకంపం.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో..
Earth quake in delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో ప్రజలంతా భయంతో పరుగులు పెట్టారు. చాలా సేపటి వరకు అసలు ఏంజరుగుతుందో కూడా.. జనాలకు తెలియని పరిస్థితి నెలకొంది.
Earth quake in delhi video goes viral: దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో బైటకు పరుగులు పెట్టారు. రిక్టర్ స్కేల్ మీద ఈ భూకంపం..5.8 గా నమోదైనట్లు తెలుస్తోంది. పాక్ లో సంభవించిన భూకంపం.. ఢిల్లీ నుంచి చండీగఢ్ వరకు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో భూమి కంపించడగానే.. ఒక్కసారిగా జనాలు భయంతో బైటకు పరుగులు పెట్టారు . చాలా సేపటి వరకు కూడా.. అసలు ఏంజరిగిందో కూడా అర్థం కాలేదు. దీంతో పోలీసులు.. సెఫ్టీ ప్రదేశాలకు వెళ్లాలని కూడా పోలీసులు సూచించారు.
భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై.. 5.8 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఈ భూకంపం ప్రభావం ఢిల్లీ-ఎన్‌సీఆర్, చండీగఢ్ పరిసర ప్రాంతాల్లో కూడా సంభవించింది.
ఇదిలా ఉండగా.. పాక్ లో భూకంపం..కేంద్రం ఉందని కూడా అధికారులు వెల్లడించారు. పాక్ లోని.. ఇస్లామాబాద్, లాహోర్‌లలో కూడా భూమి కంపించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందో వివరాలు తెలియాల్సి ఉంది.
Read more: Viral Video: పట్టాల మీదకు వచ్చి గుర్రుగా నిద్రపోయిన యువతి.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు.. వీడియో..
భూకంపం కారణంగా ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఈ తీవ్రత .. ఇతర రాష్ట్రాలైన.. ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, హర్యానా, జమ్మూ కాశ్మీర్‌లలో కూడా భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.