Election Commission: ఏపీ ఎన్నికల వేళ ఎన్నికల సంఘం ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఎన్నికల్లోపు పూర్తి చేయాలని భావించిన డీఎస్సీ పరీక్షల నిర్వహణకు బ్రేక్ పడింది. అటు టెట్ ఫలితాలు, ఇటు డీఎస్సీ పరీక్షల నిర్వహణను ఎన్నికలయ్యేవరకూ వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఏపీ ప్రభుత్వానికి ఆదేశించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తవానికి ఏపీ టెట్ పరీక్షలు, డీఎస్సీ పరీక్షల నిర్వహణ ఈపాటికే పూర్తి కావల్సింది. కానీ హైకోర్టు ఆదేశాలతో షెడ్యూల్ రివైజ్ అయింది. కొత్త షెడ్యూల్ ప్రకారం మార్చ్ 20-22 మధ్యలో ఏపీ టెట్ పరీక్ష 2024 ఫలితాలు వెల్లడి కావల్సి ఉంది. అదే సమయంలో మార్చ్ 30 నుంచి ఏప్రిల్ 30 వరకూ డీఎస్సీ పరీక్షలు 2024 నిర్వహించాల్సి ఉంది. ఇందులో భాగంగా మార్చ్ 20 నుంచి డీఎస్సీ పరీక్షా కేంద్రాల వెబ్ ఆప్షన్ల ప్రక్రియ, మార్చ్ 25 నుంచి హాల్ టికెట్ల డౌన్‌లోడ్ పూర్తవాలి. కానీ ఈలోగా ఎన్నికల కోడ్ రావడంతో అనుమతి కోసం ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని కోరింది. మరోవైపు దాదాపు వేయికి పైకా పరీక్షల వాయిదా వేయాలనే ఫిర్యాదులు ఎన్నికల సంఘానికి చేరాయి. 


ఈ క్రమంలో ఎన్నికల సంఘం నుంచి అనుమతి ఆలస్యం కావడంతో విద్యార్ధుల్లో నెలకొన్న గందరగోళాన్ని దూరం చేసేందుకు ప్రభుత్వం పరీక్షల నిర్వహణను వాయిదా వేసింది. ఎన్నికల కమీషన్ నుంచి ఆదేశాలు వచ్చాక అటు టెట్ ఫలితాల విడుదల, ఇటు డీఎస్సీ రివైజ్డ్ షెడ్యూల్ ఉంటాయని ప్రకటించింది. కానీ ఇప్పుడు ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెలువడ్డాయి. ఎన్నికల కోడ్ ముగిసేవరకూ టెట్ ఫలితాల విడుదల, డీఎస్సీ పరీక్షల నిర్వహణ వాయిదా వేయాలని ఈసీ ఆదేశించింది. 


Also read: Congress 9 Guarantees: కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే అమలు చేసే 9 గ్యారంటీలు ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook