Bypolls Schedule: హుజూరాబాద్, బద్వేల్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల
Bypolls Schedule: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికల శంఖారావం మోగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రెండు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Bypolls Schedule: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికల శంఖారావం మోగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రెండు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరోసారి ఉపఎన్నికల(Bypolls)వేడి రాజుకుంది. తెలంగాణలోని హుజూరాబాద్(Huzurabad Bypoll), ఏపీలో బద్వేల్(Badvel Bypoll) అసెంబ్లీ నియోజకవర్గాలకు త్వరలో ఉపఎన్నిక జరనుంది. ఈ ఉపఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అక్టోబర్ 30వ తేదీన రెండు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా, నవంబర్ 2వ తేదీన కౌంటింగ్ ఉంటుంది.
హుజూరాబాద్, బద్వేల్ ఉపఎన్నిక షెడ్యూల్ ఇదీ(Bypolls Schedule)
అక్టోబర్ 1న నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8 కాగా, అక్టోబర్ 11 న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13 కాగా, అక్టోబర్ 30వ తేదీన పోలింగ్ జరగనుంది. నవంబర్ 2వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. పూర్తిగా కోవిడ్ గైడ్‌లైన్స్ పాటిస్తూ పోలింగ్, కౌంటింగ్ జరగనున్నట్టు ఎన్నికల కమీషన్ వెల్లడించింది.
తెలంగాణ ఉద్యమంలో కీలక వ్యక్తిగా, టీఆర్ఎస్(TRS)పార్టీ స్థాపనలో ముఖ్యుడిగా వ్యవహరించిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉపఎన్నిక అనివార్యమైంది. భూ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలు, ఇతర కారణాలతో ముఖ్యమంత్రి కేసీఆర్..ఈటెల రాజేందర్‌ను(Eetela Rajender) మంత్రి పదవి నుంచి తప్పించారు. దాంతో ఎమ్మెల్యే పదవికి, పార్టీకు రాజీనామా చేసిన ఈటెల బీజేపీ(BJP) తీర్ధం పుచ్చుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఇవాళ విడుదలైనా ఇప్పటికే హుజూరాబాద్‌లో ఉపఎన్నికల వేడి రోజూ రగులుకుంటూనే ఉంది.
ఇక ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం(Badvel Bypoll) ఉపఎన్నికకు కూడా షెడ్యూల్ విడుదలైంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party)ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య హఠాన్మరణంతో బద్వేల్ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈయన ఊపిరితిత్తుల కేన్సర్‌తో మార్చ్ నెలలో మరణించారు. వృత్తిరీత్యా వైద్యుడైన వెంకట సుబ్బయ్య 2016లో బద్వేలు నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా వ్యవహరించారు. అనంతరం 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.
Also read: Instagram Kids Version: ఇన్‌స్టాగ్రామ్ కిడ్స్ వెర్షన్ ఇప్పట్లో లేనట్టే, కారణమేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook