EC Action: ఎన్నికల్లో హింసపై ఎన్నికల సంఘం కొరడా.. పోలీసులు, అధికారులపై తీవ్ర చర్యలు
EC Serious On Post Election Riots In Andhra Pradesh: ఎన్నికల అనంతరం హింసాత్మక సంఘటన చెలరేగడాన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం అధికారులపై తీవ్ర చర్యలు తీసుకుంది. విధుల్లో నుంచి తొలగించడంతోపాటు బదిలీ వేటు వేసింది.
Election Commission: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజు, ఆ తర్వాతి రోజుల్లో చెలరేగిన హింసాత్మక సంఘటనలపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. శాంతి భద్రతలు కాపాడడంలో విఫలమైన అధికారులపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా వివరాలు సేకరించి ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ప్రధానంగా పోలీస్ శాఖపై కఠిన చర్యలు తీసుకుంది.
Also Read: YS Jagan Foreign Trip: సీఎం వైఎస్ జగన్‌కు శుభవార్త.. విదేశీ ప్రయాణానికి సీబీఐ కోర్టు పచ్చజెండా
తీవ్ర హింసాత్మక సంఘటనలు, అల్లర్లు చెలరేగిన పల్నాడు, అనంతపురం జిల్లా పోలీస్ అధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఆయా జిల్లాల ఎస్పీలను విధుల్లో నుంచి తొలగించింది. పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలను ఈసీ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు జిల్లాల్లో మొత్తం 12 మంది సబార్డినేట్ పోలీస్ అధికారులపై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
Also Read: Gold Mins In AP: స్వర్ణ ఆంధ్రప్రదేశ్‌గా ఏపీ.. కర్నూలు జిల్లాలో తవ్వినకొద్దీ బంగారం
బదిలీ, సస్పెండైన వారు వీరే..
- తిరుపతి డీఎస్పీ సురేందర్ రెడ్డి
- ఎస్బీ సీఐ రాజశేఖర్
- ఎస్వీ డీఎస్పీ భాస్కర్ రెడ్డి
- అలిపిరి సీఐ రామచంద్ర రెడ్డి
- నరసరావుపేట డీఎస్పీ బీఎస్‌ఎన్ వర్మ
- గురజాల డీఎస్పీ పల్లపురాజు
- ఎస్బీ సీఐ ప్రభాకర్ రావు
- ఎస్బీ సీఐ బాలనాగిరెడ్డి
- కారంపూడి ఎస్సై రామాంజనేయులు
- నాగార్జునసాగర్ ఎస్ఐ కొండారెడ్డి
- తాడిపత్రి డీఎస్పీ గంగయ్య
- తాడిపత్రి సీఐ మురళీకృష్ణ
వీరందరిపై వేటు వేసిన ఎన్నికల సంఘం శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని.. వారిపై విచారణ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. సిట్ కమిటీ వేసి దర్యాప్తు నిర్వహించి ఎటువంటి చర్యలు తీసుకున్నారో రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter