Elephants Mob Attack: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఏనుగులు విజృంభించాయి. అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి దూసుకొచ్చిన ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పంట పొలాల్లో తిరుగుతూ పంటలను నాశనం చేయగా.. ఇది చూడడానికి వెళ్లిన రైతును ఏనుగును మూకుమ్మడిగా దాడి చేశాయి. తొక్కి తొక్కి చంపేయడంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఏపీలో తీవ్ర విషాదం నింపింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Viral Video: పామును మెడలో వేసుకుని 'పండుగ' చేసుకున్న తాగుబోతు


చిత్తూరు జిల్లా పీలేరు మండలం బందారు వాండ్లపల్లి గ్రామంలో మంగళవారం ఏనుగులు గుంపులుగా దూసుకొచ్చాయి. తమిళనాడు పరిసర ప్రాంతాల్లో సంచరించే ఏనుగులు అకస్మాత్తుగా ఇటు దారి మళ్లించుకుని గ్రామాలపై విరుచుకుపడ్డాయి. కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు చిన్న రాజారెడ్డికి మామిడి తోట ఉంది. తోట వద్ద అతడు కాపలా ఉన్నాడు. ఏనుగులను వెళ్లగొట్టే ప్రయత్నం చేశాడు. కోపగించుకున్న ఏనుగులు అమాంతం రాజారెడ్డిపైకి దాడికి పాల్పడ్డారు.

Also Read: Wine Shops: ఏపీలో మద్యం దుకాణాల రచ్చ.. లాటరీ దక్కించుకున్న వ్యక్తి కిడ్నాప్‌


 


సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. రైతు కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేపట్టారు. బాధిత రైతుకు నష్ట పరిహారం చెల్లించాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. వెంటనే వారిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. 


కాగా పీలేరు పట్టణ సమీపంలో 20 ఏనుగుల గుంపు సంచరించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల గుంపు తరిమేందుకు అటవీ శాఖ అధికారులు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సంఘటన స్థలానికి సందర్శించిన పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి సందర్శించారు. రైతు మృతుదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఏనుగుల గుంపు నుంచి ప్రజలకు ప్రమాదం తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ప్రజలు ఏనుగులు గుంపు బయట వెళ్లేంతవరకు ప్రజలు సహకరించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి