Eluru:భర్త లింగమార్పిడి-వేరే వ్యక్తితో ఆమె సహజీవనం-చివరకు విషాదాంతం
Live-in Partners death in Eluru: ఏలూరుకు చెందిన ఓ జంట కథ విషాదాంతమైంది. ప్రియురాలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా... ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా ఈ జంట సహజీవనం చేస్తున్నారు.
Live-in Partners death in Eluru: ప్రియురాలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ప్రియుడు ఉరేసుకుని ఆత్మహత్యకు (Suicide) పాల్పడ్డాడు. కొంతకాలంగా సహజీవనం చేస్తున్న ఈ ఇద్దరు వ్యసనాలకు బానిసయ్యారు. మద్యం సేవించి బైక్‌పై వెళ్తున్న సమయంలో అదుపు తప్పి కిందపడిపోవడంతో.. ప్రియురాలి తలకు బలమైన గాయమై మృతి చెందింది. ప్రియురాలి మృతితో భయాందోళనకు గురైన ప్రియుడు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో (Eluru) ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏలూరులోని బీడీ కాలనీకి చెందిన సుధారాణికి (22) గతంలో సాయిప్రభు అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించే సాయిప్రభు కొంతకాలం క్రితం లింగమార్పిడి (Sex Change Surgery) చేయించుకున్నాడు. అప్పటినుంచి సుధారాణి.. తన ఇద్దరు కుమార్తెలను తల్లి వద్ద ఉంచి భర్తకు దూరంగా ఆమె వేరే చోట ఉంటోంది.
ఈ క్రమంలో ఆమెకు డింపుల్ కుమార్ (23) అనే వ్యక్తి పరిచయమయ్యాడు. పరిచయం కాస్త ప్రేమగా మారడంతో కొంతకాలంగా ఇద్దరు సహజీవనం (Live-in Relationship)చేస్తున్నారు. ఈ క్రమంలో వీరికి ఒక పాప కూడా పుట్టింది. ఇటీవలి కాలంలో ఈ ఇద్దరు వ్యసనాలకు బానిసయ్యారు. శుక్రవారం (డిసెంబర్ 5) రాత్రి ఇద్దరు మద్యం సేవించి బైక్‌పై ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో ఓ చోట బైక్ అదుపు తప్పి ఇద్దరు కిందపడిపోయారు. ప్రమాదంలో సుధారాణి తలకు తీవ్ర గాయమవడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
Also Read: Karnataka: ఆవులు పాలివ్వట్లేదు-పితికేందుకు వెళ్తే తంతున్నాయి-పోలీసులకు రైతు ఫిర్యాదు
సుధారాణి మృతితో భయపడిపోయిన డింపుల్ కుమార్... మృతదేహాన్ని అక్కడే వదిలి పారిపోయాడు. అర్ధరాత్రి సమయంలో ఇంటికి చేరుకుని... ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటిరోజు ఉదయం సుధారాణి కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సుధారాణి ఆధార్ కార్డు అడగడంతో కుటుంబ సభ్యులు ఆమె ఇంటికి వెళ్లగా... డింపుల్ కుమార్ ఫ్యాన్‌కు వేలాడుతూ (Suicide) కనిపించాడు. సుధారాణి మృతి, డింపుల్ కుమార్ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook