ED Raids in Ap: తెలుగు సినీ నిర్మాత, వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసంతో పాటు ఆఫీసులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. ల్యాండ్ గ్రాబింగ్ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ దాడులు చేసినట్టు తెలుస్తోంది. ఈ దాడుల్ని ఈడీ ఇప్పటికే నిర్ధారించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విశాఖపట్నం మాజీ ఎంపీ, ప్రముఖ బిల్డర్, తెలుగు సినీ నిర్మాత ఎంవీవీ సత్యనారాయణపై ల్యాండ్ గ్రాబింగ్ కేసు ఉంది. వృద్ధులు, అనాధల ఆశ్రమానికి చెందిన 12.5 ఎకరాల భూమిని ఫోర్టరీ పత్రాలతో ఆక్రమించారనేది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి విశాఖపట్నంలోని ఆరిలోవ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఎంవీవీ సత్యనారాయణ ఏపీ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు. ఈ కేసుకు సంబంధించి క్రిమినల్ కుట్ర, మోసం, ఫోర్జరీ, క్రిమినల్ ఇన్టిమిడేషన్ ఆరోపణలున్నాయి. హయగ్రీవ కన్‌స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ జగదీశ్వరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. 


ఈ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ రంగంలో దిగింది. విశాఖపట్నంతో సహా ఐదు ప్రదేశాల్లో దాడులు నిర్వహించింది. ప్రస్తుతం ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. 


Also read: Tirumala Darshanam Letters: ఎమ్మెల్యేలకు గుడ్‌న్యూస్, తిరుమల దర్శనం లేఖల కోటా పెంపు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి