కాంట్రాక్టు ఉద్యోగులకు గుడ్ న్యూస్; రెగ్యులరైజ్ కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగులరైజ్ విషయంలో ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగులకు రైగులరైజ్ చేసే అంశంపై దృష్టి సారించారు ఏపీ సీఎం జగన్. ఈ అంశంపై మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీలో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల నాని, ఆదిమూలపు సురేశ్ తదితరులు ఉన్నారు.
ఇదిలా ఉండగా ఈ కమిటీ సభ్యులు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే విషయంలో అన్ని కోణాల్లో ఈ కమిటీ పరిశీలన జరిపి నివేదిక రూపొందించి సీఎం జగన్ కు అందించాల్సి ఉంది.