సుజనా గ్రూప్ కు ఈడీ షాక్ ; 315 కోట్ల ఆస్తులు ఎటాచ్
ఎన్నికల ముందు టీడీపీకి మరో భారీ షాక్ తగిలింది.
కేంద్రం మాజీ మంత్రి , టీడీపీ నేత సుజనా చౌదరీకి ఈడీ షాక్ ఇచ్చింది. బ్యాంకు ఫ్రాడ్ కేసులో సుజనా గ్రూప్ కు చెందిన రూ 315 కోట్లు విలువ చేసే ఆస్తులను ఈడీ ఎటాచ్ చేసింది. ఈడీ యాక్ట్ ప్రకారం హైదరాబాద్, చెన్నై బెంగళూరు, ఢిల్లీలోని ఆస్తులను ఈడీ ఎటాచ్ చేశామని ఈడీ అధికారులు పేర్కొన్నారు
ప్రముఖ మీడియా కథనం ప్రకారం సుజానా గ్రూప్ కు సంబంధించిన కంపెనీగా ప్రచారంలో ఉన్న బీసీఈపీఎల్ కంపెనీ సెల్ కంపెనీ బ్యాంకులకు పెద్దమొత్తంలో బకాయి పడింది. చెన్నైలోని ఆంధ్ర బ్యాంకు..సెంట్రల్ బ్యాంకు నుంచి బీసీఈపీఎల్ కంపెనీ రుణం తీసుకొని సకాలంలో తీర్చకుండా మోసం చేసిందని బాధిత బ్యాంకులు సీబీఐకు ఫిర్యాదు చేశారు. బాధిత బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
బీసీఈపీఎల్ కంపెనీ తీసుకున్న రుణాలను సుజనా గ్రూప్ కు చెందిన మహాల్ హోటల్, వైస్త్రాయ్ హోటల్ కు బదిలాయించినట్లు సీబీఐ గుర్తించింది. బ్యాంకు ల నుంచి తీసుకున్న రుణాలను మిగిలిన కంపెనీలకు బదలాయించినట్లు విచారణలో తేలింది. దీంతో సీబీఐ బీసీఈపీఎల్ కంపెనీ వ్యవహారాన్ని ఈడీకి అప్పగించింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఈడీ మనీ లాండరింగ్ యాక్ట్ ను ఉయోగించి సుజనా కంపెనీలకు చెందిన రూ. 315 కోట్ల ఆస్తులను జప్తు చేసింది.