Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో స్వతంత్య్ర సిట్‌ ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నిజ స్వరూపాన్ని సుప్రీం కోర్టు ఎత్తి చూపిందని.. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా రెచ్చగొడుతున్నాడనేది గట్టి కామెంట్స్ చేసిందన్నారు. దేవుణ్ని రాజకీయాల్లోకి లాగొద్దని చెప్పిన సుప్రీం.. చంద్రబాబు స్వయంగా వేసుకున్న ‘సిట్‌’ను కూడా రద్దు చేసిందని గుర్తు చేసుకున్నారు. తిరుమల స్వామివారి ప్రసాదంపై చేసిన ప్రచారం చాలా దారుణమన్నారు. ఈ విషయంపై కోర్టు మొట్టికాయ వేసిందన్నారు. చంద్రబాబుకు దేవుడంటే భక్తి, భయం ఉండదన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Udhayanidhi Stalin: పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం స్ట్రాంగ్ వార్నింగ్‌.. 'వెయిట్‌ అండ్‌ సీ' అని హెచ్చరిక


"ధర్మారెడ్డి నాకు బావ అంట. కరుణాకర్‌రెడ్డి నాకు మామ అంట. మనిషి అన్నాక కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. ఇంత దారుణంగా వక్రీకరణ చేయడమా? సుప్రీంకోర్టు నిజానికి చంద్రబాబుకు అక్షింతలు వేస్తే, దాన్ని ఆరోజు  నేషనల్‌ మీడియా మొత్తం రాసింది. ప్రతి నేషనల్‌ ఛానల్, ప్రతి ఇంగ్లిష్‌ పేపర్, చంద్రబాబును తప్పు బట్టినా, ఆయన్ను సుప్రీంకోర్టు తిట్టినా, ఆక్షేపించినా, టీడీపీ సోషల్‌ మీడియాలో రాస్తున్నది చూస్తుంటే.. ఆయన ఎంత నీచానికి దిగాడన్నది తెలుస్తుంది. నిజానికి సుప్రీంకోర్టు చంద్రబాబును తిడితే, దాన్నీ వక్రీకరిస్తూ.. మా పాపం పండింది. వైవీ సుబ్బారెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం అని రాశారు. ఇంత దారుణంగా వక్రీకరిస్తూ, చంద్రబాబు దిగజారిపోయిన పరిస్థితి.
 
రాజకీయ ప్రయోజనం కోసం, దేవుడంటే, భయం భక్తి లేకుండా పచ్చి అబద్ధాలు చెప్పారు. రాజకీయ దురుద్దేశంతో అబద్ధాలు ఆడి, తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాశస్త్యం, లడ్డూ విశిష్టతను అపవిత్రం చేస్తూ చంద్రబాబు అన్న మాటలపై మేము ప్రధానికి, సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు లేఖలు రాశాం. అంతే కాకుండా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్‌ వేశాం. దీంతో కోర్టులో న్యాయమూర్తులు ఎలా స్పందించారో ఒకసారి గుర్తు చేసుకొండి.. నిజానికి సుప్రీంకోర్టు ఎవరినీ తప్పు పట్టింది. ఎవరు దేవుడి దగ్గర దోషిగా నిలబడాలి. ఎవరికి దేవుడంటే భయం, భక్తి ఉంది.


అసలు పవన్‌కు సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసా? సాక్షాత్తూ నువ్వు ఆ కూటమిలో ఉన్నావు. నీ కళ్ల ఎదుటే చంద్రబాబు ఆ తప్పు చేశాడు. అది నీతో సహా, ఆరేళ్ల పిల్లాడికి కూడా కనిపిస్తోంది. శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రాశస్త్యం, లడ్డూ విశిష్టతను తగ్గిస్తూ, కొన్ని కోట్ల మంది విశ్వాసాలకు విఘాతం కలిగిస్తూ.. చంద్రబాబు మాట్లాడితే.. అన్నీ తెలిసి నువ్వూ అదే మాట మాట్లాడావు. అలాంటి నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నావు. దేవుడి విషయంలో తప్పు జరుగుతున్నా, ఎత్తి చూపకపోవడం ఎంత వరకు సబబు? అలాంటి నీవు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నావు. అదే నా సనాతన ధర్మం వైఖరి. తిరుపతిలో సరుకులు, నెయ్యి సేకరణకు ఒక రొబొస్టు విధానం ఉంది. స్వామివారి పవిత్రతను తగ్గిస్తూ, మనమే అలా మాట్లాడడం ఏ విధంగా ధర్మం..?


సుప్రీంకోర్టు ఇంత ఆక్షేపించినా, చంద్రబాబు చేసిన తప్పు ఎత్తి చూపినా, ఆయన స్వయంగా వేసుకున్న సిట్‌ను రద్దు చేసినా.. చంద్రబాబులో మార్పు లేదు. ఒక అబద్దాన్ని నిజం చేయడానికి మళ్లీ మళ్లీ అబద్ధాలు చెబుతున్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామితో ఆడుకుంటున్నాడు. ఆయనకు పరిహారం తప్పదు. తెలిసి తెలిసి వెంకటేశ్వరస్వామివారితో ఆడుకుంటున్నాడు. సుప్రీంకోర్టు అబ్జర్వేషన్లు ఇలా ఉన్నప్పుడు, టీటీడీ ఈఓ మాటలు రికార్డుగా ఉన్నప్పుడు.. నిజానికి అక్కడ ఏమీ జరగలేదు కాబట్టి.. సిట్‌ అవసరం లేదు. కానీ ఎందుకా పని చేస్తున్నారంటే.. అక్కడ ఏదో జరిగినట్లు చూపే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఏమీ జరగకపోయినా, అబద్ధాలకు రెక్కలు కట్టి, ప్రచారం చేస్తున్నారు.." అని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. 


Also Read: Navratri 2024: దేవీ నవరాత్రుల్లో ఈ తప్పులు పొరపాటున కూడా చేయోద్దు.. పండితులు ఏమంటున్నారంటే..?..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter