మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని కుప్పం నుంచి అభ్యర్థిగా ప్రకటించిన జగన్.. బీసీలు ఎక్కువగా ఉన్న ఆ నియోజక‌వర్గం నుండి ఎన్నికైన చంద్రబాబు ఆ కులాలకు ఇప్పటి వరకూ చేసింది ఏమీలేదని విమర్శించారు. తమ పార్టీ గెలుపు కుప్పం నియోజకవర్గం నుంచే ప్రారంభం అవుతుందని జగన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తేనే.. బీసీలకు నిజమైన మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.


ప్రస్తుతం వైయస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఘనంగా సాగుతోంది. ఆ యాత్రలో భాగంగానే కుప్పం వచ్చిన జగన్, ఆ నియోజకవర్గ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించారు. చంద్రబాబుపై పోటీ చేయబోయే కె.చంద్రమౌళి గతంలో కడప జిల్లా కలెక్టరుగా పనిచేశారు. ఆయన 1975 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.