AP New Liquor Policy Tenders: కొత్త మద్యం విధానం తీసుకొచ్చి టెండర్ల ప్రక్రియ పూర్తవగా దీనిపై తీవ్ర వివాదం మొదలైంది. దరఖాస్తు చేసుకున్న వారిలో కూటమి పార్టీ నాయకులకు అత్యధిక లాటరీలు వచ్చాయనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఈ సమయంలోనే వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో సంపద సృష్టిస్తామని చెప్పిన కూటమి పెద్దలు.. ఇప్పుడు తాము మాత్రమే సంపద సృష్టించుకుంటామనే రీతిలో ఉన్నారని ఆరోపించారు. మద్యం టెండర్లలో కూటమి నాయకులకే వచ్చాయని కీలక వ్యాఖ్యలు చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Guntur Town: గుంటూరు జిల్లాకు మోదీ సర్కార్ భారీ శుభవార్త.. ఏం ఇచ్చిందో తెలుసా?


మద్యం టెండర్ల కేటాయింపుపై విశాఖపట్టణంలో మంగళవారం మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. 'ఎన్నికల ముందు సంపద సృష్టి అని చంద్రబాబు చెప్పారు. అంటే రాష్ట్రానికి సంపద సృష్టిస్తారని అందరూ అనుకున్నారని.. కానీ మద్యం పాలసీ, వైన్‌షాప్‌ల కేటాయింపు చూసిన తర్వాత వాస్తవ పరిస్థితి అందరికీ అర్ధమైంది. వాళ్లు చెప్పిన సంపద సృష్టికి అర్ధం కేవలం తెలుగుదేశం పార్టీతోపాటు కూటమి నాయకులకు మాత్రమే సంపద సృష్టించడం అన్నట్లుగా తేలింది' అని ఎద్దేవా చేశారు.

Also Read: Elephants Attack: డిప్యూటీ సీఎం పవన్‌ శ్రమ వృథా.. ఏనుగుల దాడిలో రైతు దుర్మరణం


 


మద్యం దుకాణాల కేటాయింపుల్లో అన్ని చోట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి ప్రజా ప్రతినిధులకు ఎక్కువ షాప్‌లు దక్కాయని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఆరోపించారు. ఈ సందర్భంగా పెద్ద కుంభకోణమే జరిగిందని చెప్పారు. ‘రాష్ట్రంలో పెద్ద కుంభకోణం జరిగింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి, తెలుగుదేశం నాయకుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా మద్యం పాలసీ తీసుకువచ్చారు. ఆ క్రమంలోనే వైన్‌షాప్‌ల కేటాయింపు జరిగింది’ అని తెలిపారు.


తాము అధికారంలోకి వచ్చాక 43 వేల బెల్టుషాప్‌లు రద్దు చేశామని.. 4,500 వైన్‌షాప్‌లు ఉంటే 2,900కి తగ్గించినట్లు గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. మద్యం దుకాణాలు తగ్గించి పేద కుటుంబాలను రక్షించి వారిని మద్యం బారి నుంచి కాపాడాలని చూశామని వివరించారు. నాడు వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ ప్రభుత్వ సేవలు అందిస్తే, ఇప్పుడు చంద్రబాబు ఇంటింటికీ మద్యం పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారని విమర్శించారు.


'రానున్న రోజుల్లో వీధికో బెల్టు షాప్‌ ఉంటుంది. ఇంటికే మద్యం సరఫరా మొదలుపెడతారు' అని తెలిపారు. విద్య, వైద్య రంగాలను పూర్తిగా పక్కన పెట్టేసి మద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. వెంటనే మద్యం పాలసీ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మద్యంపై పేదలు తప్పకుండా తిరగబడతారని చెప్పారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి