Viveka Second Wife Statement: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసులో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తూ.. ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు రెడీ అవుతుండగా.. ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టుకు చేరింది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన సుప్రీం.. ఈ నెల 24వ తేదీ వరకు అవినాష్‌ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సీబీఐను ఆదేశించింది. సోమవారం మరోసారి ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది. అప్పటివరకు అవినాష్ రెడ్డి అరెస్ట్ ఆగిపోగా.. తాజాగా వివేకా రెండో భార్య షేక్ షమీమ్ తొలిసారి తెరపైకి వచ్చారు. తొలిసారి ఆమె సంచలన స్టేట్‌మెంట్‌ను బయటపెట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీబీఐకి షేక్ షమీమ్ మూడు పేజీల స్టేట్‌మెంట్‌ను ఇచ్చారు. 2010లో తనను వివేకా పెళ్లి చేసుకున్నారని.. 2015లో షేహన్ షా (కొడుకు) జన్మించాడని వెల్లడించారు. వివేకాకు దూరంగా ఉండాలని సునీత రెడ్డి బెదిరించారని తెలిపారు. హత్యకు కొన్ని గంటల ముందు ఫోన్‌లో వివేకా మాట్లాడారని.. బెంగళూరు భూ సెటిల్మెంట్లో రూ.8 కోట్లు వస్తాయని చెప్పారని అన్నారు. 


తమ పెళ్లి వివేకా కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో తమను దూరం పెట్టారని చెప్పారు. షేహాన్ షాను రాజకీయంగా పైకి తీసుకొస్తానని వివేకా చెప్పేవారని అన్నారు. తనను పలుమార్లు వివేకా బామ్మర్ది, అల్లుడి అన్న నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి బెదిరించారన్నారు. అన్యాయంగా వివేకా చెక్ పవర్‌ను తొలగించారని అన్నారు.


Also Read: Retirement Planning: ఈ ఐదు పథకాల్లో ఇన్వెస్ట్ చేయండి.. మంచి లాభాలను పొందండి   


'నాకు వివేకా గారికి పుట్టిన సంతానమే షేక్ శేహాన్ షా. నేను డీఎన్‌ఏ టెస్ట్ ద్వారా నిరుపిస్తా. మాకు సంతానం కలగలేదని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న దస్తగిరి అనే ముద్దాయి నిరూపిస్తే నేను మీరు చెప్పినట్లు చేస్తాను. ఒకవేళ నిరూపించలేకపోతే వెంటనే ఈ హత్య చేసిన నీవు ఉరిశిక్షకు సిద్దమా..? వివేకా ఆస్తిపై సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్ కన్నేశారు. పదవిపై ఆయన అన్న నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి ఆశపడ్డారు. వివేకా ఇంటికి వెళ్దామనుకున్నా.. కానీ శివ ప్రకాష్ రెడ్డి మీద భయంతో అటు వైపు వెళ్లలేదు..' అంటూ షమీమ్ స్టేమ్‌మెంట్‌లో పేర్కొన్నారు. తన లాయర్ ద్వారా ఓ న్యూస్‌ ఛానెల్‌కు ఆమె తన స్టేట్‌మెంట్‌ను పంపించారు.


Also Read: Hyderabad Boy Murder: నరబలి కలకలం.. బాలుడు దారుణ హత్య.. ఎముకలు విరిచి, బకెట్‌లో కుక్కి..  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook