రైతుల సబ్సీడి సొమ్ము.. ఉద్యోగి భార్య ఖాతాలోకి!
రైతుల సబ్సీడి సొమ్ము.. ఉద్యోగి భార్య ఖాతాలోకి!
కర్నూలు: వ్యవసాయ శాఖలో పనిచేస్తోన్న ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించి రైతులకు చెందాల్సిన రూ.28.65 లక్షల విలువైన సబ్సీడి సొమ్మును అక్రమంగా తన భార్య బ్యాంక్ ఖాతాలోకి మళ్లించిన ఘటన కర్నూలు జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. జిల్లా వ్యవసాయ శాఖలో పనిచేస్తోన్న రాజేష్ అనే ఉద్యోగి రైతుల సబ్సిడీ సొమ్మును తన భార్య స్వాతి ఖాతాకు మళ్లించారని తెలుసుకున్న రైతులు ఆందోళనకు దిగడంతోనే అసలు బాగోతం వెలుగులోకొచ్చినట్టు తెలుస్తోంది.
రైతులను మోసం చేయడంతోపాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించారనే నేరం కింద పోలీసులు ఆ ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.