Fengal Cyclone Alert: భయపెడుతున్న ఫెంగల్ తుపాను, ఏపీలోని ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు జాగ్రత్త
Fengal Cyclone Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపటికి తుపానుగా మారనుంది. ఫెంగల్ తుపాను ఏపీ, తమిళనాడు తీరాలవైపుకు దూసుకొస్తోంది. ఫలితంగా ఏపీలోని ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Fengal Cyclone Alert: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇప్పుడు గంటకు 3 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కిలోమీటర్ల దూరంలో, ట్రింకోమలీకు 130 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకు 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు ఉదయానికి తుపానుగా బలపడనుంది.
నవంబర్ 30 నాటికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వెంబడి కారైకాల్, మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా మారనుంది. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చు. ఫెంగల్ తుపాను కారణంగా ఈ నెల 29, 30 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తుర వర్షాలు పడవచ్చు. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అతి తీవ్ర భారీ వర్షసూచన ఉంది. ఫెంగల్ తుపాను తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. దక్షిణ కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ అయ్యాయి.
ముఖ్యంగా పంట కోతల విషయంలో రైతన్నలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ అయ్యాయి. ఫెంగల్ తుపాను కారణంగా నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఇక విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ప్రకాశం, సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల , పల్నాడు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడనున్నాయి.
నవంబర్ 3వ తేదీన బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
Also read: Ys Jagan: చంద్రబాబు మంచోడా నేను మంచోడినా, విద్యుత్ కొనుగోలు ఒప్పందం కధ ఇదీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.