పవన్ కల్యాణ్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదు
పవన్ కల్యాణ్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదు
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గం నుంచి పోటీచేస్తోన్న పవన్ కల్యాణ్ శుక్రవారం అక్కడ నిర్వహించిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ‘తెలంగాణా.. లేక పాకిస్థానా?’ అని చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ అడ్వకేట్ జేఏసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఏపీలో జరగనున్న ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై, తెలంగాణ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ అడ్వకేట్ జేఏసి జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా అడ్వొకేట్ జేఏసీ హెచ్చరించింది.