విజయనగరం : ఏపీలో కరోనావైరస్ కాటుకు మరొకరు బలయ్యారు. విజయనగరం జిల్లా ( Vizianagaram district ) బలిజపేట మండలం చిలకలపల్లికి చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు కరోనాతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. గత కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ తీవ్ర అనారోగ్యం పాలైన వృద్ధురాలు విశాఖలోని విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో డయాలసిస్ ( Dialysis VIMS ) చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు కరోనావైరస్ సోకినట్టు గుర్తించిన వైద్యులు ఆమెకు కరోనా చికిత్స అందిస్తూ ఆమె కుటుంబ సభ్యులకు,సెకండరీ కాంటాక్ట్స్‌ బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకుని కోవిడ్-19 టెస్ట్ చేశారు. కరోనావైరస్ టెస్ట్ రిపోర్ట్ (COVID-19 test report) వచ్చేలోగా వారిని క్వారంటైన్‌కి తరలించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : తెలంగాణలో Coronavirus లేటెస్ట్ అప్‌డేట్స్


ఇదిలావుండగానే విమ్స్‌లో కరోనా చికిత్స తీసుకుంటున్న వృద్ధురాలు శనివారం కన్నుమూశారు. విజయనగరం జిల్లాలో ఇదే తొలి కరోనా పాజిటివ్ మృతిగా కేసు నమోదైంది ( First coronavirus death in Vizianagaram ). ఇప్పటివరకు జిల్లాలో నలుగురికి కరోనా వైరస్ పాజిటివ్‌ సోకినట్టుగా గుర్తించారు. ఏపీలో కరోనావైరస్ ప్రభావం అతి తక్కువగా కనిపించిన రెండు జిల్లాలో విజయనగరం ఒకటి. ఈ రెండు జిల్లాల్లో మరొకటైన శ్రీకాకుళం జిల్లాలోనూ ఇప్పటివరకు ఐదుగురికి కరోనావైరస్ పాజిటివ్‌గా గుర్తించినట్టు అక్కడి అధికారవర్గాలు వెల్లడించాయి. 


Also read : COVID-19 deaths : కరోనా మృతుల్లో వాళ్లే అధికం


ప్రస్తుతం అందుబాటులో ఉన్న అప్ డేట్స్ ప్రకారం ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 1930కి చేరుకోగా.. ఇప్పటివరకు 887 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 999 యాక్టివ్ కేసులు ఉన్నాయి. లక్షా 65 వేల 69 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..