Students Went Missing in Beach: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం సీతాపాలెం సమీపంలోని పుడిమడక బీచ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. అనకాపల్లి డైట్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 12 మంది విద్యార్థులు సరదాగా బీచ్‌లో స్నానం చేస్తుండగా వారిలో ఏడుగురు సముద్రంలో గల్లంతయ్యారు. గల్లంతయిన వారిలో పవన్ (19) అనే విద్యార్థి మరణించగా.. సూరిశేటి తేజ అనే మరో విద్యార్థిని అక్కడే ఉన్న స్థానిక మత్స్యకారులు కాపాడారు. తోటి విద్యార్థులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గల్లంతయిన మిగతా ఐదుగురిలో నర్సీపట్నానికి చెందిన సూర్ల జశ్వంత్ కుమార్, గుంటూరుకి చెందిన బయ్యపునేని సతీష్ కుమార్, గోపాలపట్నానికి చెందిన జగదీశ్, చూచుకొండకు చెందిన పెంటకోట గణేష్, యలమంచిలికి చెందిన చందూగా గుర్తించారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గల్లంతయిన యువకుల కోసం అచ్యుతాపురం పోలీసులు, మెరైన్ పోలీసులు గాలిస్తున్నారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్, ఇతర అధికార యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. స్థానిక మత్స్యకారులు కూడా సిబ్బందికి తోడుగా ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. పొద్దుపోయే సమయానికి ఘటన చోటుచేసుకోవడం, ఆ తర్వాత చీకటి పడటంతో సహాయ కార్యక్రమాలు చేపట్టడం కొంత ఇబ్బందిగానే మారిందని అధికారులు చెబుతున్నారు. 


లేదంటే మిగతా వారి ప్రాణాలు కూడా అపాయంలో పడేవే..
విద్యార్థులు స్నానానికి బీచ్‌లో దిగిన సమయంలోనే ఒక్కసారిగా అలలు వేగంగా దూసుకొచ్చాయని.. ఆ సమయంలో కొంతమంది విద్యార్థులు ఒడ్డున నిలుచుని ఉండగా మిగతా విద్యార్థులు నీళ్లలో ఉన్నారని సహా విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతూ చెప్పారు. కొంతమంది విద్యార్థులు ఒడ్డున లేకపోయుంటే వారి ప్రాణాలు కూడా అపాయంలో పడేవే అనే ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.


Also Read : Anil Kumar Yadav Audio Leaked: అనిల్ కుమార్ యాదవ్‌కి లోన్ రికవరీ ఏజెంట్ కాల్.. చెప్పుతో కొడతానన్న మాజీ మంత్రి
Also Read : Balineni Srinivas Reddy On Casino: క్యాసినోలకు వెళతా... పేకాట ఆడతా.. ఏపీ మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook