POWER SHOCK: శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ పల్లిలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. కరెంట్ కాటు ఐదుగురిని బలి తీసుకుంది. ఆటోపై విద్యుత్ తెగ పడిటంతో కరెంట్ షాక్ తగిలింది. మంటలు రావడంతో ఆటో తగలబడింది. కూలీ పనులకు వెళుతున్న ఐదుగురు మహిళలు సజీవ దహనమయ్యారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే కూలీలు చనిపోయారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఘటనపై స్పందించిన విద్యుత్ అధికారులు తమదైన శైలిలో వివరణ ఇచ్చారు. కరెంట్ తీగలపై ఉడత వెళ్లడంతో ఎర్తింగ్‌ అయి టెంపరేచర్ పెరిగి తీగలు తెగిపడ్డాయట. ఇది ఏపీ విద్యుత్ శాఖ అధికారుల వాదన.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ అధికారుల వివరణపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సబ్‌స్టేషన్‌లో రక్షణ వ్యవస్థలు పని చేయకపోవడమే కరెంట్ తీగలు తెగిపడటానికి కారణమన్న అభిప్రాయం నిపుణుల నుంచి వస్తోంది. మాములుగా కరెంట్ తీగలు తెగిపడితే వెంటనే ఎర్తింగ్‌ అవుతుంది. ఆ తర్వాత 11 కేవీ సబ్‌స్టేషన్‌లోని బ్రేకర్లు వాటంతట అవే పనిచేస్తాయి.  లైన్లకు కరెంట్ సరఫరా ఆగిపోతుంది. ఇదంతా క్షణాల్లోనే జరిగిపోతుంది. 11 కేవీ సబ్‌స్టేషన్‌లో బ్రేకర్లు పనిచేయకపోయినా... 33 కేవీ సబ్ స్టేషన్ లో అలాంటి వ్యవస్థే ఉంటుంది. ఏదైనా సమస్యలతో 11 కేవీ సబ్‌స్టేషన్ బ్రేకర్లు పనిచేయకుంటే.. 33 కేవీ సబ్‌స్టేషన్‌లోని బ్రేకర్లు పనిచేస్తాయి. ఇలా రెండు దశల్లో భద్రతా వ్యవస్థ డిస్కంలలో ఉంటుంది. చిల్లకొండయ పల్లి ప్రమాదంలో ఈ రెండు వ్యవస్థలు పనిచేయలేదని తెలుస్తోంది. బ్రేకర్లు పనిచేస్తే కూలీల ప్రాణాలు దక్కేవని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు.


పుట్టపర్తి జిల్లాలో ప్రమాదం జరిగింది  11 కేవీ లైన్ లో.  ఈ లైన్ లో 12 లీడ్‌ల  వైర్లు ఉంటాయి. అధికారులు చెప్పినట్లు వైర్లు తెగిపడితే అక్కడ ముందు మంటలు రావాలి. కాని ప్రమాదం జరిగినప్పుడు తీగలపై ఎలాంటి మంటలు రాలేదని స్థానికులు చెబుతున్నారు. ఉడత తోక భాగంలోని వెంట్రుకలు కొంచెం కాలిపోయాయి. అయితే కరెంట్ తీగలు తెగిపడేంత ఉష్ణోగ్రత వస్తే.. ఉడత ఎందుకు కాలిపోలేదన్నది ప్రశ్నగా మారింది. దీంతో సాంకేతిక, నిర్వహణ లోపాలా వల్లే దారుణం జరిగిందని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. డిస్కంలు భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వల్లే ఏపీలో వరుసగా విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. సబ్ స్టేషన్లలోని బ్రేకర్లలో సాంకేతిక సమస్యలు వస్తే అమర్చాల్సిన సామాగ్రిని డిస్కంలు కొన్ని రోజులుగా ఇవ్వడం లేదని తెలుస్తోంది. సమస్యలు ఉన్న బ్రోకర్లను మార్చడానికి కొత్తవి అందుబాటులో లేవు. వీటి కోసం ప్రతి డిస్కం 10 కోట్లు రూపాయస నిధిని ఏర్పాటు చేయాలని ఏపీఈఆర్‌సీ సూచించినా ఎవరూ పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా అధికారుల నిర్వహణ వైఫల్యం వల్లే శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో ఐదుగురు కూలీలు సజీవ దహనమయ్యారనే ఆరోపణలు జనాల నుంచి వస్తున్నాయి. 


Read also: Covid Cases: నిన్నటితో తగ్గిన కొవిడ్ తీవ్రత.. దేశంలో కొత్తగా ఎన్ని కేసులు వచ్చాయంటే?


Read also: LPG Cylinder Price: ఎల్‌పీజీ వినియోగదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన సిలిండర్ ధర..   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.