Konijeti Rosaiah: ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అనారోగ్యంతో నేడు తుది శ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్​పై చెరగని ముద్ర వేసిన రోశయ్య వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం ఇప్పుడు చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొణిజేటీ రోశయ్య 1933 జులై 4న గుంటూరులోని వేమురులో జన్మించారు.  గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ అభ్యసించారు. ఆయనకు భార్య, నలుగు సంతానం ఉన్నారు. 


రాజకీయ ప్రస్థానం..


1968-85 వరకు ఆంధ్రప్రదేశ్​ శాసన మండలిలో శాసన సభ్యుడిగా ఉన్నారు రోశయ్య. ఇందులో 1978-85 వరకు శాసన మండలిలో ప్రరతిపక్ష నేతగా కొనసాగారు.


ఆ తర్వాత 1979-83 కాలంలో రాష్ట్ర మంత్రి వర్గంలో ఆయనకు చోటు దక్కింది.


1985లో తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శానస సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1989 వరకు కొనసాగారు.


1989-94 కాలంలో మరోసారి మంత్రి పదవిలో ఉన్నారు. 2004 లో చీరాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1998–1999 కాలంలో నర్సారావు పేట నియోజకవర్గం నుంచి లోక్​ సభకు ప్రాతనిథ్యం వహించారు రోశయ్య.


2009లో శాసన మండలి నుంచి ప్రాతినిథ్యం వహించారు రోశయ్య. 2004 లో వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రోశయ్య ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. 2009లో రాజశేఖర్​ రెడ్డి మరణానంతరం.. రాష్ట్ర ముఖ్య మంత్రిగా రోశయ్య బాధ్యతలు స్వీకరించారు. ఏడాది పాటు ఆ పదవిలో కొనసాగారు. క్రియాశీల రాజకీయాల్లో ఆయన చేపట్టిన చివరి పదవి ఇదే కావడం గమనార్హం.


ఆ తర్వాత 2011లో తమిళనాడు గవర్నర్​గా నియమితులయ్యారు రోశయ్య. 2016 వరకు ఆ పదవిలో కొనసాగారు. మధ్యలో 2014లో రెండు నెలల పాటు కర్ణాటక గవర్నర్​గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహించారు.


రాజకీయాల్లో దాదాపు ఆయన 60 ఏళ్ల పాటు కొనసాగారు. ఇంత సుదీర్ఘ కాలంపాటు రాజకీయాల్లో ఉన్న అతి కొద్ది రాజకీయ నాయకుల్లో రోశయ్య ఒకరు.


రోశయ్య చేపట్టిన పదవులు..


రాష్ట్ర పరిధిలో ఉండే దాదాపు అన్ని శాఖల్లో రోశయ్య పని చేశారు. 1979లో టంగుటూరి అంజయ్య, కోట్ల విజయభాస్కర రెడ్డి (రెండు సార్లు), నేదురుమల్లి జనార్ధనరెడ్డి, వైఎస్​ రాజశేకర్​ రెడ్డి(రెండు సార్లు)లు ముఖ్య మంత్రులుగా ఉన్నప్పుడు రోశయ్య పలు కీలక పదవుల్లో పని చేశారు. వాటన్నింటిలో ఆర్థిక మంత్రిగా ఆయన.. రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు.


మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెట్​ను ప్రవేశ పెట్టి రికార్డు సృష్టించారు. అందులో 7 సార్లు వరుసగా కావడం మరో విశేషం. అందుకే బహుముఖ ప్రజ్ఞాశాలిగా రోశయ్యకు ఆంధ్రా రాజకీయాల్లో గుర్తింపు ఉంది. ఈ అనుభవం వల్లనే వైఎస్​ఆర్​ మరణానంతరం ఏపీ సీఎంగా ఆయనను ఎన్నుకుంది కాంగ్రెస్ అధిష్ఠానం.
1994-96 మధ్య ఆంధ్ర ప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా కూడా రోశయ్య పని చేశారు.


Also read: Konijeti Rosaiah: మాజీ సీఎం రోశయ్య మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం


Also read: Breaking News: ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూత!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook