Kiran kumar Reddy: నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా రికార్డులకు ఎక్కారు. 2009లో వై.యస్.రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత అప్పటి కాంగ్రెస్ హై కమాండ్ రోశయ్యను సీఎంగా చేసింది. అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఏపీ శాసన సభ స్పీకర్ గా వ్యవహరించారు. రోశయ్య సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ఇక్కడ కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం అప్పటి వరకు స్పీకర్ గా.. ఛీఫ్ విప్ గా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డిని ఎలాంటి మంత్రి పదవి అనుభవం లేని కిరణ్ కుమార్ రెడ్డిని అనూహ్యంగా సీఎంను చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఆంధ్ర ప్రదేశ్ విభజన విషయంలో కాంగ్రెస్ హై కమాండ్ తో కిరణ్ కుమార్ రెడ్డి చివరి వరకు పోరాడారు. అయినా ఫలితం లేకపోవడంతో సీఎం పదవికి రాజీనామా చేసారు. ఆ తర్వాత సొంతంగా జై సమైఖ్యాంద్ర పార్టీ స్థాపించి 2014 ఎన్నికల్లో పోటీ చేసిన పెద్దగా ప్రభావం చూపించలేదు.  ఆ తర్వాత కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ  కండువా తిరిగి కప్పుకున్నారు.


ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2023లో భారతీయ జనతా పార్టీలో చేరారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరుపున ఏపీలోని రాజంపేట లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్ధి పివీ మిథున్ రెడ్డి చేతిలో 76071 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.  


ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన నేతృత్వంలోని  కూటమి విజయం సాధించినా.. ఆ ప్రభంజనంలో కిరణ్ కుమార్ రెడ్డి గెలవలేకపోయారు. దీంతో కేంద్రం ఆయనకు తెలంగాణ గవర్నర్ గా నియమించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్ లోనే. ఇక్కడ స్థానిక పరిస్థితులపై ఆయనకు పూర్తి స్థాయి అవగాహన కూడా ఉంది. మరోవైపు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉండనే ఉంది. మరోవైపు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఒవైసీ సోదరులకు అప్పట్లో చుక్కలు చూపించిన సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డికి మంచి పేరే దక్కింది. ఈ అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకొని తెలంగాణ గవర్నర్ గా రాజీనామా చేసిన తమిళ సై ప్లేస్ లో కిరణ్ కుమార్ రెడ్డిని పూర్తి స్థాయి గవర్నర్ గా నియమించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి గవర్నర్ చేస్తే  ఇక్కడ రాజకీయంగా భారతీయ జనతా పార్టీ  మరింత పట్టు సాధించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న రాధాకృష్ణన్ ను తెలంగాణ ఇంచార్జ్ గవర్నర్ గా ఉన్నారు.  


ఇప్పటికే కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో అన్ని రాష్ట్రాలకు ఇంచార్జ్ గవర్నర్ ల ప్లేస్ లో పూర్తి స్థాయి గవర్నర్ లను నియమించనున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ గవర్నర్ గా నియమించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.


Read more: Us man forceful sneeze: బాప్ రే.. గట్టిగా తుమ్మగానే.. పొట్ట చీల్చుకుని బైటపడ్డ పేగులు.. ఎక్కడో తెలుసా..?..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter