విజయవాడ: బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు ఇక లేరు. గత నెల రోజులుగా కరోనావైరస్‌తో ( Coronavirus ) బాధపడుతూ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న ఆయన ఇవాళ కొద్దిసేపటి క్రితమే మృతి చెందారు. ప్రస్తుతం ఆయన వయసు 60 సంవత్సరాలు. 2014 సాధారణ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నుంచి బీజేపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో బీజేపి, టీడీపీ, జనసేన ఓ కూటమిగా ఏర్పడి విజయం సాధించిన నేపథ్యంలో బీజేపి తరపున ఆయనకు ఏపీ కేబినెట్‌లో మంత్రి పదవిని దక్కింది. అలా చంద్రబాబు నాయుడు హయాంలో 2014 నుంచి 2018 వరకు ఏపీ దేవాదాయ శాఖ మంత్రిగా మాణిక్యాల రావు ( Paidikondala Manikyala Rao ) సేవలు అందించారు. Also read: Vizag crane tragedy: సీఎం జగన్ స్పందన


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మాజీ మంత్రి మాణిక్యాల రావు మృతితో తాడేపల్లిగూడంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. మాణిక్యాల రావు మృతిపై బీజేపి నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. 


సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి:
మాజీ మంత్రి మాణిక్యాల రావు కరోనాతో చనిపోయారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్... మాణిక్యాల రావు కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతపాన్ని తెలియజేశారు. Also read: 
BJP in AP: రాజధాని విషయంలో బీజేపి వైఖరి ఇదే