Former CBI JD Lakshminarayana Sensational Comments On Gali janadhan Reddy: సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీ నారాయణ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ వార్త పొలిటికల్ హీట్ ను పెంచేసేదిగా మారింది. గతంలో తాను సీబీఐలో జేడీ గా ఉన్నప్పుడు గాలిజనర్ధన్ రెడ్డిపై కేసులు నమోదుచేసి, ఇబ్బందులు పెట్టానని ఆయన అనుచరులు తనపై పగపెంచుకున్నారని జేడీ లక్ష్మీ నారాయణ ఆరోపణలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో బరిలో ఉన్నానని, ఎలాగైన మట్టుపెట్టేందుకు ప్లాన్ లు చేశారని, తనకు సమాచారం వచ్చిందని జేడీ లక్ష్మీ నారాయణ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనపై చర్యలు తీసుకొని తనకు సెఫ్టీ కల్పించాలని కూడా పోలీసులను కోరారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: MLA Harish Rao: రేవంత్ నీ చిత్త శుద్ధిని నిరూపించుకో.. గన్ పార్కు వద్ద కీలక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే హరీష్ రావు..


ఇదిలా ఉండగా.. విశాఖపట్నం నార్త్ నుంచి జై భారత్ నేషనల్ పార్టీ తరపున మాజీ సీబీఐ లక్ష్మీ నారాయణ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ చేసిన  ఆరోపణలు  ఏపీలో తీవ్ర దుమారంగా మారాయి. తనను గాలి జనర్ధాన్ రెడ్డి అనుచరులు,  హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు.  విశాఖపట్నం నార్త్ నుంచి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ బరిలో నిలిచారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని,గాలి జనార్ధన్ రెడ్డి అనుచరులు ప్లాన్ చేశారని అన్నారు. ఈ మేరకు విశాఖ సీపీని కలిసి తన ఫిర్యాదు అందజేశారు.


అదే విధంగా తనకు సెక్యురిటీ కల్పించాలని కోరారు.  కాగా ఫిర్యాదుకు సంబంధించి ఏయే అంశాలను పేర్కొన్నారు.. అనుమానితుల పేర్లు ఏమైన మెన్షన్ చేశారా..  వంటి విషయాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీ నారాయణ పాల్గొననున్నారు.


Read More: Telangana Weather: తెలంగాణాలో మరో మూడు రోజులు పొడివాతావరణం.. ఆ తర్వాత మోస్తరు వర్షాలు..


ఈక్రమంలో పోలీసులు ఆయన భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది. ఈక్రమంలో సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీ నారాయణ గతంలో .. గనుల కుంభకోణంలో గాలిజనర్ధన్ రెడ్డిని ముప్పు తిప్పలు పెట్టారని చెబుతుంటారు. అదే విధంగా ఆయన ముక్కు సూటిగా వెళ్లేవారని నేరం చేసిన వారు ఎంతటి పెద్దవారైన కూడా వాళ్లకు సరైన విధంగా కోర్టులలో శిక్ష పడేలా చూసేవారని చెబుతుంటారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter