YS Jagan Dharna: మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలనం.. ఏపీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్
YS Jagan Dharna At Delhi For President Rule In AP: టీడీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న దాడులపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
YS Jagan President Rule: ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న హింసాత్మక సంఘటనలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమై వైఎస్సార్‌సీపీ నాయకలు, సాధారణ ప్రజలపై దాడులు జరుగుతుండడంతో జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని మండిపడ్డారు. ఏపీలో నేరాలపై కేంద్ర ప్రభుత్వానికి జగన్ సంచలన విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతలు దిగజారిపోయిన ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రాష్ట్రపతి పాలనకు విజ్ఞప్తి చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా దేశ రాజధాని ఢిల్లీలో ఈనెల 24వ తేదీన ధర్నాకు దిగుతామని తెలిపారు. ఏపీ పరిస్థితులపై దేశం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
Also Read: YS Jagan Odarpu Yatra: మరో ఓదార్పు యాత్ర.. వినుకొండ నుంచే వైఎస్ జగన్ మొదలు?
45 రోజుల పాలనలో 36 హత్యలా?
అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఏపీలో ఆటవిక పాలన నడుపుతున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. '45 రోజుల పాలనలో 36 హత్యలు జరిగాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. రాష్ట్రవ్యాప్తంగా 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను, 560 ప్రాంతాల్లో ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. వెయ్యికి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయి. అధికార టీడీపీ వేధింపులతో 35 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. 300కు పైగా హత్యయత్నాలు జరిగాయి. ఇంత జరుగుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్రకు పరిమితమయ్యారు. బాధితులను ఆదుకోవాల్సిన పోలీసులు వారిపైనే కేసులు నమోదు చేస్తున్న దారుణ పరిస్థితులు ఏపీలో ఉన్నాయి' అని జగన్ వాపోయారు. ఏపీలో శాంతిభద్రత అంశంపై రాష్ర్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసి విన్నవిస్తామని తెలిపారు. ఏపీలో జరుగుతున్న ఆటవిక పాలనను జాతీయ స్థాయికి తీసుకెళ్తామని వెల్లడించారు. ఢిల్లీలో జరగనున్న ధర్నాలో తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీ నాయకులు పాల్గొంటారని వివరించారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ కార్యకర్త చేతిలో దారుణహత్యకు గురైన వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్ కుటుంబసభ్యులను మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. తాడేపల్లి నుంచి రోడ్డుమార్గాన శుక్రవారం జగన్ వినుకొండకు చేరుకున్నారు. రషీద్‌కు నివాళులర్పించి అతడి కుటుంబసభ్యులను పరామర్శించారు. మీకు అండగా ఉంటామని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. రషీద్ ఘటనపై జగన్ భావోద్వేగానికి గురయ్యారు. జగన్ వెంట మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ నాయకులు భారీగా తరలివచ్చారు.
Also Read: AP Assembly Session: అసెంబ్లీకి వైఎస్ జగన్ వెళ్తారా? లేదా చంద్రబాబులా బహిష్కరిస్తారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter