AP Politics: వచ్చే ఎన్నికల్లో పోటీపై బాలినేని ప్రకటన.. జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తారా..?
Balineni Srinivasa Reddy: ఒంగోలు అసెంబ్లీ నుంచే తాను పోటీ చేస్తానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. ఇళ్ల పట్టాలపై విషయంలో తనపై చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. ఆరోపణలు నిరూపించకపోతే వాళ్లు రాజీనామా చేస్తారా..? అని సవాల్ విసిరారు.
Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్నారంటూ ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. ఆయనకు సీఎం జగన్‌కు పడట్లేదని.. ఉమ్మడి ప్రకాశం జిల్లా పదవిని కో ఆర్డినేటర్ పదవిని ఎంపీ విజయసాయి రెడ్డికి ఇవ్వడం బాలినేనికి నచ్చడం లేదని.. తనకు ఇవ్వకపోవడంపై అసంతృప్తిగా ఉన్నారని ఓ వర్గం మీడియా జోరుగా ప్రచారం చేసింది. ఈ పుకార్లపై స్పందించిన బాలినేని.. తాను పార్టీ మారుతున్నానని ఎప్పుడు చెప్పలేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు మైండ్ గేమ్ ఆడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలోనే ఉన్నానని.. జగన్ నాయకత్వంలోనే పని చేస్తున్నానని రూమర్లపై క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా వచ్చే ఎన్నికల్లో పోటీపై కూడా మాజీ మంత్రి స్పష్టతనిచ్చారు.
తాను వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయమని అన్నారు. ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులురెడ్డి బరిలో ఉంటారని తెలిపారు. కొంతమంది ఇష్టానుసరంగా మాట్లాడుతున్నారని.. ఆ మాటలు నమ్మొద్దని కోరారు. "నేను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి తీరతా.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం.. ఇళ్ల పట్టాల విషయంలో స్కామ్ చేసినట్లు ఆరోపణలు చేస్తున్నారు. స్కామ్ చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. నిస్వార్థంగా పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు అందజేస్తున్నాం. బురద జల్లేందుకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదు. నాపై ఆరోపణలు చేసిన వారు నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం చేస్తారా..?" అని బాలినేని సవాల్ విసిరారు. ప్రజల సొమ్ము ప్రజలకు పంచుతుంటే కోర్టులో కేసులు వేసేందుకు తెలుగుదేశం పార్టీకి ఏం పని అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తాను చాలా నెమ్మదిగా ఉన్నానని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారని.. ఇందుకు గల కారణాన్ని సీఎంకు వివరించానని అన్నారు బాలినేని. ప్రతి ఇంటికి వెళ్లి సమస్యను తెలుసుకునేందుకు ఆలస్యం అవుతుందని అన్నారు. హడావుడిగా.. మొక్కుబడిగా కాకుండా జనం సమస్యలు పరిష్కరించేలా కార్యక్రమం నిర్వహిస్తున్నానని చెప్పారు. ఈ క్రమంలో ఒక్కో ఇంటికి ఎక్కువ సమయం కేటాయించాయిల్సి వస్తుందని సీఎం జగన్‌కు వివరించానని తెలిపారు. ఇక బాలినేని ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని.. ఎంపీగా మాగుంట బరిలో ఉంటారని ప్రకటించడంపై వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తారో లేదో చూడాలి మరి.
Also Read: Independence Day Celebrations: అన్ని సేవలు ఇంటి వద్దకే.. గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చాం: సీఎం జగన్
Also Read: Wanindu Hasaranga: స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా సంచలన నిర్ణయం.. టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook